హైదరాబాద్: దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వీసీ విషయంలో10 ఏండ్ల నుంచి చాలా నిర్లక్ష్యం జరిగిందన్నారు. సైఫాబాద్ లోని కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ఫ్లైయేర్, లోగోని వ్యవసాయశాఖ కమిషనర్ కోదండరెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, యూనివర్సిటీ వీసీ జానయ్యతో కలిసి ఆవిష్కరించారు.
ALSO READ | 92 శాతం కులగణన పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
ట్లాడుతూ ‘ప్రభుత్వం ఏరికోరి చాలా రోజుల తర్వాత వీసీ నియామకం చేసింది. ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి గొప్ప అగ్రికల్చర్ యూనివర్సిటీని ప్రారంభించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు మనం దిక్సూచిగా ఉండాలి. దాదాపు 47 వేల కోట్లు వ్యవసాయానికి బడ్జెట్ లో పెట్టుకున్నం. మహబూబ్ నగర్ లో రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. దీనిలో యూనివర్సిటీ భాగస్వామ్యం ఉండాలి. 60 ఏండ్లలో వచ్చిన ఫలితాలకు సంతృప్తి చెందకుండా ఇంకా ముందుకు వెళ్లాలి. ప్రభుత్వం పరంగా మా సాయం ఉంటుంది. యూనివర్సిటీ ఆ దిశగా ముందుకు వెళ్లాలి’ అని సూచించారు.అనంతరం తుమ్మల మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఏరికోరి చాలా రోజుల తర్వాత వీసీ నియామకం చేసింది. ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి గొప్ప అగ్రికల్చర్ యూనివర్సిటీని ప్రారంభించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు మనం దిక్సూచిగా ఉండాలి. దాదాపు 47 వేల కోట్లు వ్యవసాయానికి బడ్జెట్ లో పెట్టుకున్నం. మహబూబ్ నగర్ లో రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. దీనిలో యూనివర్సిటీ భాగస్వామ్యం ఉండాలి. 60 ఏండ్లలో వచ్చిన ఫలితాలకు సంతృప్తి చెందకుండా ఇంకా ముందుకు వెళ్లాలి. ప్రభుత్వం పరంగా మా సాయం ఉంటుంది. యూనివర్సిటీ ఆ దిశగా ముందుకు వెళ్లాలి’ అని సూచించారు.
వేగంగా అడుగులు: కోదండరెడ్డి
కాంగ్రెస్ప్రభుత్వం 11 నెలల్లోనే వ్యవసాయం, రైతు కూలీల విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నదని అగ్రికల్చర్ కమిషనర్ కోదండ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం డైమండ్ జూబ్లీ చేస్కునే అవకాశం కలిగిందన్నారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ ‘1975లో నేను అక్కడ చదువుకున్న. యూనివర్సిటీని కొంత రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న చాలా పోస్టులను భర్తీ చేయాలి. ఇటీవల ప్రధానమంత్రి 130 వంగడలను విడుదల చేస్తే అందులో మన యూనివర్సిటీవి లేకపోవడం బాధాకరం. కొత్త వంగడలు తీస్కొని రావాలి. విద్య, వైద్యం తర్వాత మూడోది వ్యవసాయమే’ అని తెలిపారు.