దేశంలో ఒక్కో కుటుంబంపై సగటున 90 వేల 372 రూపాయలు అప్పు ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్కో కుటుంబంపై ఒక లక్ష 29 వేల 599 రూపాయల అప్పు ఉంది. ఇందులో వ్యవసాయ కుటుంబాలే అధికంగా ఉన్నాయని నాబార్డ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. 2016లో రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% ఉంటే.. 2021–22 నాటికి అది 92%కి పెరిగింది. ఇది రాష్ట్రంలోని భూముల హోల్డింగ్‌పై ప్రభావం చూపుతున్నది.
ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో భూముల హోల్డింగ్ క్రమంగా తగ్గుతున్నది. గతంలో వ్యవసాయ కుటుంబాలకు ఇంటి జాగాతో పాటు సగటున రెండున్నర ఎకరాల భూమి ఉంటే అది రెండు ఎకరాలకు తగ్గింది. అదే దేశవ్యాప్తంగా సగటు భూమి హోల్డింగ్ 2016–-17లో 1.08 హెక్టార్ల నుంచి 2021–-22లో 0.74 హెక్టార్లకు తగ్గింది.
ఒకప్పుడు పల్లె అంటే ఎవుసం. గ్రామీణ ప్రాంతాల్లోని జనం మొత్తం వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులపై ఆధారపడి జీవించేవాళ్లు. కానీ కాలక్రమేణా పల్లెల్లో వ్యవసాయంపై ఆధారపడేవాళ్ల సంఖ్య తగ్గిపోతున్నది. తాజాగా నాబార్డ్ రిలీజ్ చేసిన ‘సెకండ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-–22’లో ఇదే తేలింది.
Also Read:-సెల్ ఫోన్ ఎఫెక్ట్.. హైపర్ యాక్టివ్ లేదా ఏకాగ్రత లోపం
తెలంగాణ పల్లెల్లో 55% మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి బతుకుతుండగా.. మిగిలిన 45% కుటుంబాలు వ్యవసాయేతర పనులు చేస్తున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు సగటున కేవలం 2 ఎకరాల భూమి ఉందని, ఈ తరహా చిన్నకమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాక చాలా మంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కున్నట్లు సర్వే తేల్చింది.
కొన్నేండ్లుగా పంటల మద్దతు ధరలు పెరుగుతు న్నందున రైతుల ఆదాయం పెరుగుతున్నదని, కానీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతు న్నాయని నాబార్డు తన రిపోర్ట్‌లో విశ్లేషించింది. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, పెట్టుబడు ల కోసం చేస్తున్న అప్పులు, వాటి వడ్డీలతో రైతుల పై భారం పడుతున్నది. అదీగాక ఒకప్పుడు రైతు లు తమకు కావాల్సిన అన్నిరకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, నూనెగింజలు తమ పొలంలో పండించుకునేవాళ్లు.
అయితే.. ప్రస్తుతం అవన్నీ బయట నుంచి ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయా ల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు పెరిగిన విని యోగ సంస్కృతి పల్లెను తాకింది. ఖర్చులు విపరీ తంగా పెరిగిపోయాయి. మారిన వాతావరణ పరిస్థి తులు, పెరిగిన గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పు వెరసి రోగాలు, వైద్య ఖర్చులు రెట్టింపయ్యాయి. ఫలితంగా ఆదాయం పెరిగినా ఖర్చులు తీసేస్తే మిగులు అంతంత మాత్రమేనని నాబార్డు తేల్చింది. రాష్ట్రంలో ఒక రైతు కుటుంబానికి సగటున రూ.781 మాత్రమే మిగు లుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.