పాటను తూటాగా మార్చిన గద్దర్

పాటను తూటాగా మార్చిన గద్దర్
  •  తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : యుద్ధనౌక గద్దర్​ తన పాటను తూటగా మార్చి అన్యాయంపై పోరాటం చేశారని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్​మెంట్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి  అన్నారు. బుధవారం సూర్యాపేటలో ఏపూరి సోమన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ గాన స్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పలువురు నివాళులర్పించారు. అనంతరం రమేశ్​రెడ్డి మాట్లాడుతూ గద్దర్ గానం తెలంగాణకు వేదమని, ఆయన స్వరం ధిక్కార పర్వతమని అభివర్ణించారు.

 గద్దర్ మరణం తెలంగాణ గుండెకు శాశ్వత గాయమని కొనియాడారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో కవులు, కళాకారులు, నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్  కాశీం, పసునూరి రవీందర్, వంగ పండు ఉష,  తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, బాషపంగు సునీల్, వేముల పుష్ప, నర్సయ్య, నవిలే ఉపేందర్, బారి అశోక్, కవులు, కళాకారులు, నాయకులు పాల్గొన్నారు.