బీ అలర్ట్ : విజయవాడ వెళుతున్నారా.. జాతీయ రహదారిపై పోటెత్తిన వరద

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్నారా.. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం ఉంది.. బీ అలర్ట్. కృష్ణా జిల్లా నందిగామ దగ్గర జాతీయ రహదారిపై వదల పొటెత్తింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ సమీపంలోని.. కీలేశపురం, జూపూడి దగ్గర రోడ్డుపై నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. ఈ క్రమంలోనే వాహనాల రాకపోకలను వన్ వేగా అనుమతిస్తున్నారు పోలీసులు. 

Also Read :- హైదరాబాదీలూ.. అత్యవసరమైతేనే బయటకు రండి

ఏపీలో అర్థరాత్రి నుంచి కుండపోత వర్షానికి.. కీలేశపురం, జూపూడి దగ్గర జాతీయ రహదారి మునిగిపోయింది. నాలుగు అడుగుల మేర వరద జాతీయ రహదారి  మీదుగా ప్రవహిస్తుంది. దీంతో కార్లలో వెళ్లేవారు ఆగిపోయారు. భారీ వాహనాలు, బస్సులు, లారీలను వన్ వేగా పంపిస్తున్నారు అధికారులు. నందిగామ సమీపంలో ఇప్పటికే వందల సంఖ్యలో కార్లు నిలిచిపోయాయి. భారీ వర్షం పడుతూనే ఉండటంతో.. వరద తగ్గటానికి చాలా సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.

హైదరాబాద్.. విజయవాడ జాతీయ రహదారి మొత్తం వర్షం పడుతూనే ఉంది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని.. వాహనాలను నిదానంగా నడపాలని సూచిస్తున్నారు పోలీసులు.