ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ

బషీర్​బాగ్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఏఐటీయూసీ ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వీఎస్ బోస్, ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మంత్రికి వినతిపత్రం అందజేశారు.

గత నెలలో జరిపిన చర్చల్లో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఏడాదికి రూ.12 వేలు, ఆటో చార్జీలు పెంపు, రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు, యాప్, కొత్త ఆటో పర్మిట్ల మంజూరు, స్కూల్ వ్యాన్లు, ఓలా, ర్యాపిడో, ఉబర్ బైక్​లు నిషేదం, ఇతర జిల్లాల ఆటోలను సిటీలోకి రాకుండా నిషేధం వంటి ప్రధాన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.