
బోర్డు మీటింగ్‌లో ఆమోదం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (టైకార్) 2024– 25 ఫైనాన్సియల్ ఇయర్‌కు రూ.360 కోట్లతో యాన్యువల్ ప్లాన్ ను బోర్డు ఆమోదించింది. గురువారం మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్లో చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన జరిగిన 9వ బోర్డ్ మీటింగ్‌లో ట్రైబల్ సెక్రటరీ శరత్, జీఎం శంకర్ రావుతో పాటు పలు శాఖల అధికారులు అటెండ్ అయ్యారు. ఈ నిధులతో రాష్ట్రంలో 28,350 మంది గిరిజనులకు వివిధ స్కీమ్‌ల ద్వారా సహాయం చేస్తామని చైర్మన్ బెల్లయ్య నాయక్ తెలిపారు.
సీఎం ఎస్టీ ఎంట్రపెన్యూవర్ షిప్ ఇన్నోవేషన్ స్కీమ్ (సీఎంఎస్టీఈఐ), ఇందిరగిరి జల వికాసం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్‌లు నిర్వహిస్తామన్నారు. మూడు త్రైమాసికాలకు సంబంధించి ఫండ్స్ రిలీజ్‌పై ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ బోర్డు తీర్మానాన్ని ప్రభుత్వానికి త్వరలో పంపనున్నారు. ఈ తీర్మానాలను ఆమోదించి జీవోలు ఇచ్చాక ట్రైబల్ పబ్లిక్ నుంచి వివిధ స్కీమ్‌లకు, ఆర్థిక సహాయం అందించే స్కీమ్‌లకు ట్రైబల్ శాఖ అప్లికేషన్లు స్వీకరించనుంది.