
- ప్రమాదస్థలంలో మట్టి, బురద తప్ప..మనుషుల జాడలేదు!
- టీబీఎం మిషిన్ చుట్టూ బురదలో
- కూరుకుపోయి ఉంటారనే అనుమానాలు
- టన్నెల్ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీమ్
- అక్కడ అత్యంత భయానకంగా పరిస్థితులు
- లైనింగ్ వేసిన ఏరియాలోనూ నీటి ఊటలు
- శిథిలాలు, మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం
- కదిలిస్తే కంపనమే అన్నట్టుగా అక్కడి పరిస్థితి
- ఎండోస్కోపిక్ పరికరాలతో నేడు ఎన్జీఆర్ఐ టెస్ట్
- బురద తొలగించడమే పెద్ద సవాల్
మహబూబ్‌నగర్ / నాగర్‌కర్నూల్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఏ మూలో సజీవంగా ఉంటారనుకున్న 8 మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు అంటున్నారు. వాళ్లంతా బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల నిరంతర ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు.. టన్నెల్‌లో ప్రమాదం జరిగిన చోటుకు ఆర్మీ రెస్క్యూ టీమ్ బుధవారం సాయంత్రం చేరుకుంది. అక్కడి ఫొటోలను, వీడియోలను మీడియాకు విడుదల చేసింది.
ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్టీమ్, ర్యాట్హోల్మైనర్స్చెప్తున్న దాని ప్రకారం.. టన్నెల్చివరి భాగంలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఎటుచూసినా మట్టి, బురద, శిథిలాలే తప్ప.. ఆ ఎనిమిది మంది జాడలేదు. పైకప్పు కూలిన ప్రాంతం నుంచి టన్నెల్500 మీటర్ల వరకు మట్టి, బురద నీటితో ఊబిలా మారింది. టన్నెల్ ఎత్తు 10.2 మీటర్లు కాగా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దాదాపు 9.2 మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలు ఉన్నాయి.
అందులోనే టీబీఎం మిషిన్ ముందు భాగం కూరుకుపోయింది. అక్కడ కన్వేయర్ బెల్టు పూర్తిగా ధ్వంసమైంది. గాలి కోసం ఏర్పాటు చేసిన భారీ పైపు కూడా కూలి టీబీఎం మిషిన్ మీద పడింది. దీంతో గత శనివారం జరిగిన ప్రమాదంలో గల్లంతైన బాధితులు చనిపోయి టన్నెల్మిషిన్చుట్టూ బురదలో కూరుకపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆక్సిజన్ పైపు ధ్వంసం..
ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ ఏడో రెజ్మెంట్ టీమ్‌కు చెందిన ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ బుధవారం లీడ్ తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన నేతృత్యంలో ఆర్మీ జవాన్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ టన్నెల్‌లోకి వెళ్లారు. దాదాపు 11 కిలోమీటరు వరకు లోకో ద్వారా చేరుకున్నారు. అక్కడి నుంచి నీరు, బురద ఉండడంతో థర్మకోల్షీట్లు, వెదురు బొంగులు, రబ్బర్ ట్యూబులు, తాళ్లను ఉపయోగిస్తూ ముందుకు కదిలారు. మధ్యలో ఇద్దరు ఆర్మీ జవాన్లు స్కిడ్ అయి దాదాపు మోకాళ్ల లోతు బురదలో కూరకపోయారు.
వెనుక ఉన్న వారు పైకి లాగి, అడుగులో అడుగువేసుకుంటూ 13.5 కిలోమీటరు పాయింట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ క్లిష్టపరిస్థితులు ఏర్పడ్డాయి. పైనుంచి సీపేజ్, మట్టి పెల్లలు ఊడిపడుతున్నాయి. డేంజర్ జోన్ కావడంతో నేషనల్జియోఫిజికల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) చేసిన సూచనలు మేరకు సిమెంట్ బ్లాక్స్‌ను ముట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు. అక్కడి నుంచి అరకిలోమీటరు దూరంలో యాక్సిడెంట్ స్పాట్ ఉండగా.. దాదాపు 8 మీటర్ల ఎత్తున మట్టి, రాళ్లు, సిమెంటు స్లాబులు పేరుకుపోయాయి.
అక్కడి నుంచి కూలిపోయిన కన్వేయర్ బెల్ట్‌కు సంబంధించిన ట్రాక్ద్వారా రెస్క్యూ టీమ్ ముందుకు కదిలింది. దాని మీద వంగి నడుచుకుంటూ 13.910 కిలోమీటరు వద్దకు చేరుకున్నారు. అక్కడ మట్టిలో పూడుకపోయిన టీబీఎం మిషిన్కనిపించడంతో అదే యాక్సిడెంట్ పాయింట్‌గా నిర్ధారణకు వచ్చారు. అక్కడ మట్టి, శిథిలాలు దాదాపు 9.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. కేవలం రెండు, మూడు ఫీట్ల ఎత్తు మాత్రమే మిలిగి ఉంది. మనిషి నిలబడే అవకాశం లేకుండా ఉంది.
టీబీఎం మిషన్ 150 మీటర్ల పొడవు ఉండగా.. ఇది దాదాపు తొమ్మిది మీటర్లు మట్టిలో కూరుకుపోయినట్లు గుర్తించారు. అలాగే ఆక్సిజన్‌కోసం ఏర్పాటు చేసిన పైపు పగిలి టీబీఎం మిషిన్ మీద పడి ఉండటాన్ని గమనించారు. కన్వేయర్ బెల్టు పూర్తిగా ధ్వంసమైంది. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే కాంట్రాక్ట్ సంస్థ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ధ్వంసమైంది. ఇక్కడే గత శనివారం ఉదయం 8 మంది బాధితులు గల్లంతయ్యారు. దీంతో వారి ప్రాణాలపై ఆశలు లేవని రెస్క్యూ టీమ్స్ స్పష్టం చేశాయి.
సహాయక చర్యలు ముమ్మరం..
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్రప్రభుత్వం రెస్క్యూ టీమ్స్‌ను ఆదేశించింది. రెండు రోజుల్లో పని పూర్తి చేయాలని చెప్పడంతో నిపుణుల సూచనల మేరకు ప్లాన్ ప్రకారం రెస్య్కూ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికితోడు టీబీఎం శిథిలాలను కట్ చేయడానికి కాంట్రాక్ట్ సంస్థను ప్రభుత్వం ఒప్పించింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి రెస్య్కూ టీమ్స్ సహాయక చర్యల్లో వేగం పెంచాయి. ప్రమాద ధాటికి టన్నెల్‌లో యాక్సిడెంట్ స్పాట్ నుంచి దాదాపు కిలోమీటరు దూరం వరకు సిమెంట్ సెగ్మెంట్స్ (సిమెంటు పలకలు) కదులుతున్నాయి.
వాటి నుంచి సీపేజ్ కంటిన్యూ అవుతోంది. ముట్టుకుంటే ఊడిపడే పరిస్థితి ఉందని తేలడంతో ముందుగా డీసిల్టింగ్, డీవాటరింగ్ చేయనున్నారు. ఆతర్వాత ఎలక్ట్రిక్ కట్టర్లు, గ్యాస్ కట్టర్లు, వెల్డింగ్ మిషిన్లతో టీబీఎం శిథిలాలను తొలగించే చాన్స్ ఉంది. అనంతరం కన్వేయర్ బెల్టుకు రిపేర్లు చేసి పెద్ద మొత్తంలో పేరుకున్న మట్టి తీసిన తర్వాతే గల్లంతైన బాధితుల ఆనవాళ్లు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు.
కాగా, గురువారం ఉదయం ఎన్జీఆర్ఐ (నేషనల్జియోఫిజికల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్) టీమ్టన్నెల్లోకి చేరుకొని జియోఫిజికల్టెస్టులు చేయనుంది. వారు ఓకే చెప్పాకే శిథిలాలు, బురద తొలగింపు పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.
ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్టీమ్, ర్యాట్హోల్మైనర్స్చెప్తున్న దాని ప్రకారం.. టన్నెల్చివరి భాగంలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఎటుచూసినా మట్టి, బురద, శిథిలాలే తప్ప.. ఆ ఎనిమిది మంది జాడలేదు. పైకప్పు కూలిన ప్రాంతం నుంచి టన్నెల్500 మీటర్ల వరకు మట్టి, బురద నీటితో ఊబిలా మారింది. టన్నెల్ ఎత్తు 10.2 మీటర్లు కాగా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దాదాపు 9.2 మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలు ఉన్నాయి.
అందులోనే టీబీఎం మిషిన్ ముందు భాగం కూరుకుపోయింది. అక్కడ కన్వేయర్ బెల్టు పూర్తిగా ధ్వంసమైంది. గాలి కోసం ఏర్పాటు చేసిన భారీ పైపు కూడా కూలి టీబీఎం మిషిన్ మీద పడింది. దీంతో గత శనివారం జరిగిన ప్రమాదంలో గల్లంతైన బాధితులు చనిపోయి టన్నెల్మిషిన్చుట్టూ బురదలో కూరుకపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆక్సిజన్ పైపు ధ్వంసం..
ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మీ ఏడో రెజ్మెంట్ టీమ్‌కు చెందిన ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ బుధవారం లీడ్ తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన నేతృత్యంలో ఆర్మీ జవాన్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ టన్నెల్‌లోకి వెళ్లారు. దాదాపు 11 కిలోమీటరు వరకు లోకో ద్వారా చేరుకున్నారు. అక్కడి నుంచి నీరు, బురద ఉండడంతో థర్మకోల్షీట్లు, వెదురు బొంగులు, రబ్బర్ ట్యూబులు, తాళ్లను ఉపయోగిస్తూ ముందుకు కదిలారు.
మధ్యలో ఇద్దరు ఆర్మీ జవాన్లు స్కిడ్ అయి దాదాపు మోకాళ్ల లోతు బురదలో కూరకపోయారు. వెనుక ఉన్న వారు పైకి లాగి, అడుగులో అడుగువేసుకుంటూ 13.5 కిలోమీటరు పాయింట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ క్లిష్టపరిస్థితులు ఏర్పడ్డాయి. పైనుంచి సీపేజ్, మట్టి పెల్లలు ఊడిపడుతున్నాయి. డేంజర్ జోన్ కావడంతో నేషనల్జియోఫిజికల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) చేసిన సూచనలు మేరకు సిమెంట్ బ్లాక్స్‌ను ముట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు.
అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలో యాక్సిడెంట్ స్పాట్ ఉండగా.. దాదాపు 8 మీటర్ల ఎత్తున మట్టి, రాళ్లు, సిమెంటు స్లాబులు పేరుకుపోయాయి. అక్కడి నుంచి కూలిపోయిన కన్వేయర్ బెల్ట్‌కు సంబంధించిన ట్రాక్ద్వారా రెస్క్యూ టీమ్ ముందుకు కదిలింది. దాని మీద వంగి నడుచుకుంటూ 13.910 కిలోమీటరు వద్దకు చేరుకున్నారు. అక్కడ మట్టిలో పూడుకపోయిన టీబీఎం మిషిన్కనిపించడంతో అదే యాక్సిడెంట్ పాయింట్‌గా నిర్ధారణకు వచ్చారు.
అక్కడ మట్టి, శిథిలాలు దాదాపు 9.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. కేవలం రెండు, మూడు ఫీట్ల ఎత్తు మాత్రమే మిలిగి ఉంది. మనిషి నిలబడే అవకాశం లేకుండా ఉంది. టీబీఎం మిషన్ 150 మీటర్ల పొడవు ఉండగా.. ఇది దాదాపు తొమ్మిది మీటర్లు మట్టిలో కూరుకుపోయినట్లు గుర్తించారు. అలాగే ఆక్సిజన్‌కోసం ఏర్పాటు చేసిన పైపు పగిలి టీబీఎం మిషిన్ మీద పడి ఉండటాన్ని గమనించారు.
కన్వేయర్ బెల్టు పూర్తిగా ధ్వంసమైంది. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలోనే కాంట్రాక్ట్ సంస్థ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ధ్వంసమైంది. ఇక్కడే గత శనివారం ఉదయం 8 మంది బాధితులు గల్లంతయ్యారు. దీంతో వారి ప్రాణాలపై ఆశలు లేవని రెస్క్యూ టీమ్స్ స్పష్టం చేశాయి.
సహాయక చర్యలు ముమ్మరం..
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్రప్రభుత్వం రెస్క్యూ టీమ్స్‌ను ఆదేశించింది. రెండు రోజుల్లో పని పూర్తి చేయాలని చెప్పడంతో నిపుణుల సూచనల మేరకు ప్లాన్ ప్రకారం రెస్య్కూ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికితోడు టీబీఎం శిథిలాలను కట్ చేయడానికి కాంట్రాక్ట్ సంస్థను ప్రభుత్వం ఒప్పించింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి రెస్య్కూ టీమ్స్ సహాయక చర్యల్లో వేగం పెంచాయి.
ప్రమాద ధాటికి టన్నెల్‌లో యాక్సిడెంట్ స్పాట్ నుంచి దాదాపు కిలోమీటరు దూరం వరకు సిమెంట్ సెగ్మెంట్స్ (సిమెంటు పలకలు) కదులుతున్నాయి. వాటి నుంచి సీపేజ్ కంటిన్యూ అవుతోంది. ముట్టుకుంటే ఊడిపడే పరిస్థితి ఉందని తేలడంతో ముందుగా డీసిల్టింగ్, డీవాటరింగ్ చేయనున్నారు. ఆతర్వాత ఎలక్ట్రిక్ కట్టర్లు, గ్యాస్ కట్టర్లు, వెల్డింగ్ మిషిన్లతో టీబీఎం శిథిలాలను తొలగించే చాన్స్ ఉంది.
అనంతరం కన్వేయర్ బెల్టుకు రిపేర్లు చేసి పెద్ద మొత్తంలో పేరుకున్న మట్టి తీసిన తర్వాతే గల్లంతైన బాధితుల ఆనవాళ్లు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు. కాగా, గురువారం ఉదయం ఎన్జీఆర్ఐ (నేషనల్జియోఫిజికల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్) టీమ్టన్నెల్లోకి చేరుకొని జియోఫిజికల్టెస్టులు చేయనుంది. వారు ఓకే చెప్పాకే శిథిలాలు, బురద తొలగింపు పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.
బురద తొలగింపు పెద్ద సవాల్..
ప్రమాదం జరిగిన స్థలంలో టన్నెల్ మొత్తం మూసుకుపోవడంతో అక్కడ చిక్కుకున్న వాళ్లంతా టన్నెల్బోర్మిషిన్చుట్టూ మట్టి, బురదలో కూరకపోయి ఉంటారని రెస్క్యూ సిబ్బంది అనుమానిస్తున్నారు. కూలిన ప్రాంతంలో బురదను, శిథిలాలను తొలిగిస్తే తప్ప వాళ్ల ఆనవాళ్లు కనిపెట్టలేమని చెప్తున్నారు. కూలిన ప్రాంతంలో శిథిలాలను, మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత మట్టి కూలే ప్రమాదమూ లేకపోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కదిలిస్తే కంపనమే అన్నట్టుగా ఉందని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే కాకుండా.. లైనింగ్ చేసిన ప్రాంతాల్లోనూ ఇప్పటికీ సీపేజ్ వస్తోంది.
గంటకు కనీసం 5 వేల నుంచి 10 వేల లీటర్ల వరకు నీరు వస్తుండడంతో రెస్క్యూ చేపట్టడం అతిపెద్ద సవాల్‌గా మారింది. నీటిని పవర్‌ఫుల్ మోటార్లతో తోడేస్తున్నా.. ఊబిలా మారిన బురదను తొలగించే పరిస్థితి కనిపించడం లేదు. మాన్యువల్‌గా తొలగించుకుంటూ పోవడమే మార్గం కాగా, దాన్ని ముట్టుకోవాలన్న ధైర్యమూ రెస్క్యూలో పాల్గొంటున్న సిబ్బంది చేయలేకపోతున్నారు. పైగా ఇలా తొలగించేందుకు చాలా రోజులు పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు టన్నెల్ లోపల ఆక్సిజన్ కూడా అందడం లేదని, ఊపిరి తీసుకోవడమూ కష్టమవుతోందని సిబ్బంది చెప్తున్నారు.
టన్నెల్‌లో గల్లంతైన వాళ్లు..
1. గురుప్రీత్ సింగ్, కంపెనీ ఆపరేటర్, పంజాబ్
2. సన్నీ సింగ్, కంపెనీ ఆపరేటర్, జమ్మూకశ్మీర్
3. మనోజ్ కుమార్, పీఈ, ఉత్తర్‌ప్రదేశ్
4. శ్రీనివాస్, ఎఫ్ఈ, ఉత్తర్‌ప్రదేశ్
5. సందీప్ సాహూ, కార్మికుడు, జార్ఖండ్
6. అనుజ్ సాహూ, కార్మికుడు,జార్ఖండ్
7. సంతోశ్ సాహూ, కార్మికుడు, జార్ఖండ్
8. జక్తాజస్, కార్మికుడు, జార్ఖండ్