Earthquake : అలర్ట్..పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక

Earthquake :  అలర్ట్..పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక

ఈ మధ్య భూకంపాలు భయపెడుతున్నాయి.  ఎప్పుడు ఎక్కడ వస్తాయో అర్థం కావడం లేదు. లేటెస్ట్ గా ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసర్చ్ అనాలసిస్ సంస్థ  తెలంగాణలో త్వరలో భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 

 పెద్దపల్లి జిల్లాలోని  రామగుండం సమీపంలో భూకంప ముప్పు పొంచి ఉందని ఎపిక్ ఎర్త్ క్వేక్ సంస్థ వెల్లడించింది. పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రభావం ఉన్నట్లు తెలిపింది.  వరంగల్, హైదరాబాద్, ఏపీలోని అమరావతి వరకు ఈ భూ ప్రకంపనలు చేరే ఛాన్స్ ఉందని సంస్థ ట్వీట్ చేసింది. మహారాష్ట్ర వరకు భూకంప ప్రభావం ఉంటుందని చెప్పింది. ఈ ఎపిక్ ఎర్త్‌క్వేక్  సంస్థ గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే  అంచనా వేసి చెప్పింది.

2024 డిసెంబర్ 4న ములుగు జిల్లా మేడారం దగ్గర 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం హైదరాబాద్,వరంగల్,ఖమ్మం, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా చూపించింది.