అయ్యా కేసీఆర్ సారూ... మా గోడు వినపడటం లేదా..

తమను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని మూడు నెలలకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేసినా KCR ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోతున్నారు. తమ సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా గన్ పార్క్ కు ర్యాలీగా వెళ్తున్న  యూనివర్శిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో నిజాం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.  

ALSO READ :హోంగార్డు రవీందర్ మృతిపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ నిజాం కాలేజీలో యూనివర్శిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.  తమను క్రమబద్దీకరించాలకి ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని  తెలంగాణలోని 12 యూనివర్శిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులు పెన్ డౌన్ లో భాగంగా గన్ పార్క్ వరకు ర్యాలీకి పిలుపు నిచ్చారు.  సీఎం కేసీఆర్ అధ్యాపకులకు ఇచ్చిన హామీని అమలు చేయడం లేదరి వాపోయారు.  తాము ఎంతో మందిని తీర్చి దిద్దామని.. వారిలో కొందరు ఉన్నత స్థాయిలో ఉండి గొప్పవారిగా ఉన్నారన్నారు.  చాలామంది పోలీస్ శాఖలో పని చేస్తున్నారని కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు. తమకు న్యాయం చేయమంటే  అరెస్ట్ లు చేయించడం ఎంతవరకు సమంజసమని కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీర్ స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.  తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 11 వ తేదీ నుంచి ఆందోళనలకు ఉధృతం చేస్తామని తెలంగాణ యూనివర్శిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.