నిజామాబాద్, వెలుగు : తెలంగాణ యూనివర్సిటీలో వైస్ఛాన్స్లర్రవీందర్గుప్తా ఈసీ మెంబర్స్ఆమోదం లేకుండా నియమించిన ఉద్యోగుల లెక్కలు తేలుతున్నాయి. రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన యాదగిరి గురు, శుక్రవారాల్లో ఇదే పనిలో నిమగ్నమయ్యారు. మొదట 130 మందే అనుకున్నా డిపార్ట్మెంటు వారీగా హెచ్ఓవోడీల నుంచి తెప్పించిన లెక్కల ప్రకారం ..147 మందిని రోజువారీ వేతనం లెక్కన నియమించారని తెలుసుకున్నారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే 23 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకున్నారు. 147 మందిని డిచ్పల్లిలోని యూనివర్సిటీ, భిక్కనూర్‌లోని సౌత్ క్యాంపస్, సారంగాపూర్‌లోని ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో నియమించినట్టు, వారికి చెక్కుల రూపంలో జీతాలు చెల్లించినట్టు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిని రిజిస్ట్రార్ యాదగిరి గురువారమే డ్యూటీకి రావొద్దని చెప్పారు. అప్పట్లో నియామక పత్రాలు లేకుండా నోటి మాటతో పనిలోకి తీసుకోవడంతో, రిజిస్ట్రార్ కూడా అదే పద్ధతిని అనుసరించడంతో శుక్రవారం ఉద్యోగులెవరూ డ్యూటీలకు రాలేదు. సీనియారిటీని పక్కనబెట్టి కొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇవ్వడాన్ని ఈసీ మెంబర్స్2021 నవంబర్ సమావేశంలో తిరస్కరించగా, ప్రస్తుతం వారి సమాచారాన్ని కూడా రిజిస్ట్రార్ సేకరిస్తున్నారు. ఓ ఉద్యోగికి ప్రమోషన్ఇచ్చి ఏరియర్స్గా సుమారు రూ.9 లక్షల లాభం పొందేట్టు చేశారని కూడా తేలింది.
ఫైవ్ కమిటీలో ఉన్నది వీరే
ఈసీ ఆమోదం లేకుండా వీసీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అధ్యయనం చేయడానికి ఫైవ్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నవీన్ మిట్టల్(కాలేజియేట్కమిషనర్), చంద్రకళ (ఫైనాన్స్డిపార్ట్మెంట్డిప్యూటీ సెక్రటరీ), వసుంధర ( ప్రిన్సిపాల్, విమెన్స్ కాలేజీ, నిజామాబాద్), ప్రవీణ్‌కుమార్ (ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కామారెడ్డి), గంగాధర్‌గౌడ్ (రిటైర్ట్ టీచర్)తో కమిటీ విచారణ నిర్వహించనుంది.
రెండేండ్ల కింద కూడా..
23 నెలల కిందట రెండోసారి వీసీగా బాధ్యతలు చేపట్టిన రవీందర్‌గుప్తా దాదాపు 225 మందిని ఔట్సోర్సింగ్విధానంలో నియమించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా భర్తీ చేయడంతో అప్పట్లో దుమారం లేపింది. ఈ విషయం సర్కారు దృష్టికి వెళ్లడం, విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో నియామకాలు రద్దయ్యాయి. సదరు ఉద్యోగుల నుంచి తీసుకున్న సొమ్ము వాపస్ఇవ్వడంతో వారు సైలెంట్అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా ఇదే భరోసాతో ఉన్నట్టు తెలుస్తోంది.