రిజిస్ట్రార్​ రూమ్ ​తాళం తెరిచిన్రు

  • డ్యూటీకి హాజరుకాని వీసీ రవీందర్​  
  • తెలంగాణ వర్సిటీలో కొనసాగుతున్న హైడ్రామా

నిజామాబాద్, వెలుగు: తెలంగాణ వర్సిటీలో సోమవారం రిజిస్ట్రార్​ఆఫీసు రూమ్​కు తాళం తీయొద్దని వీసీ సెక్యూరిటీని ఆదేశించగా, మంగళవారం సిబ్బంది గది తాళం తెరిచారు. వీసీ రవీందర్​ఆదేశాల మేరకే ఇలా చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈసీ సభ్యులతో పాటు ఈసీ మెంబర్స్ ​నియమించిన రిజిస్ట్రార్ ​యాదగిరి ఆ గది వైపు వెళ్లలేదు.

మరోవైపు వీసీ రవీందర్​గుప్తా డ్యూటీకి హాజరుకాలేదు. ఇదిలా ఉండగా యాదగిరి కాకుండా టీయూ నుంచే మరొకరిని రిజిస్ట్రార్​ గా ఎంపిక చేయాలని ఈసీ మెంబర్స్ ​ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లు పరిశీలిస్తున్నట్టు వినికిడి. వీసీ రవీందర్​ కూడా తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని రిజిస్ట్రార్​గా నియమించుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చివరకు ఈ  కథ ఏ మలుపు తిరుగుతుందో తెలియక స్టాఫ్​ అయోమయంలో  ఉన్నారు.