ఇప్పటి నుంచి ఈసీ వర్సెస్ వీసీగా ఉంటది: TU వీసీ రవిందర్ గుప్త

తెలంగాణ యూనివర్సిటీలో 2021 నుండి జరిగిన అవకతవకలు, అక్రమాలకు వీసీ రవిందర్ గుప్తను బాధ్యునిగా నిర్దారించింది ఈసీ. తెలంగాణ ఎక్స్జ్యుటివ్ కమిటీ(పాలక మండలి) వీసీని ప్రాసిక్యూట్ చేయాలని, ఎసీబీకి కేసును అప్పగించాలని నిర్ణయింది. దీన్ని వ్యతిరేకిస్తూ నిన్న విసి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో  వీసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. నవీన్ మిట్టల్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు వీసీ రవీందర్. సీఎం, సీఎస్, గవర్నర్ లకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయం ఇచ్చారని.. మంత్రి కలిసి  మాట్లాడుతామన్నారు వీసీ.

కోర్టు ఉత్తర్వులు ప్రకారం రిజిస్ట్రార్ యాదగిరి నియామకం చెల్లదని.. సీటులో కూర్చుంటే యాదగిరిపై ఫిర్యాదు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈసీ సమావేశం జరిగిందన్న వీసీ రవీందర్.. చైర్మన్ లేకుండా సమావేశం నిర్వహించారని ఆరోపించారు. త్వరలోనే తెలంగాణ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ ను నియమిస్తామన్నారు. గతంలో ఈసీ మీటింగ్ పెట్టాలని చాలా సార్లు కోరినా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు వీసీ. నోట్ ఫైల్ లేకుండా ఖర్చులు పెట్టలేదని..రూ.20 కోట్లు డబ్బులు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదని వెల్లడించారు. ఇప్పటి నుంచి ఈసీ వర్సెస్ వీసీగా ఉంటుందన్నారు వీసీ రవిందర్​గుప్త.