- మొత్తం 133 మంది దరఖాస్తు
- జల్లెడ పట్టిన సెర్చ్ కమిటీ
- ముగ్గురు పేర్లతో ఫైల్ రెడీ
- నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణ
నిజామాబాద్, వెలుగు : తెలంగాణ వర్సిటీ వీసీ పోస్టు నియామకం ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ఈ పదవి కోసం మొత్తం 133 మంది దరఖాస్తు చేయగా వారిలో అర్హుల ఎంపిక కోసం సెర్చ్ కమిటీ తీవ్రంగా శ్రమించింది. ఫైనల్‌గా ముగ్గురి పేర్లతో ఫైల్‌ను సెర్చ్‌కమిటీ గవర్నమెంట్‌కు పంపిది.15 రోజులలో స్టేట్‌లో ఖాళీగా ఉన్న వర్సిటీలకు వీసీలను నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రకటించడంతో టీయూలో వాతావరణం ఉత్కంఠగా మారింది. వీసీ పోస్టును ఆశిస్తూ వర్సిటీకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు దరఖాస్తు చేశారు. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న వారు లీడర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
పలు దఫాలు ఇంటెలిజెన్స్ విజిట్
ప్రొఫెసర్‌గా పదేండ్ల అనుభవం ఉండి 70 ఏండ్లలోపు వయస్సు గల వారినే వీసీలుగా అపాయింట్ చేస్తారు. ఈ రెండు అంశాల ప్రాతిపాదికన ఎంత మంది చేసుకున్నా అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో పదవిని ఆశిస్తున్నవారి సమర్థతను సెర్చ్‌కమిటీ పరిశీలిస్తుంది. వర్సీటీ నుంచి రిజిస్ట్రార్ యాదగిరి, ప్రొఫెసర్ విద్యావర్థిని, ప్రొఫెసర్ అరుణ, ప్రొఫెసర్ నసీం, ప్రొఫెసర్ అత్తర్సుల్తానా, ప్రొఫెసర్ కనకయ్య దరఖాస్తు చేసుకున్నారు. వీరి అర్హతలను సెర్చ్ కమిటీ పరిశీలించింది. అనుమానాల నివృత్తికి ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంది. ఓయూలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ విషయంలో వివరాల సేకరణ కోసం జిల్లాకు మూడు సార్లు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్లారు.
కామారెడ్డి జిల్లాకు చెందిన జేఎన్టీయూలో మెకానికల్ ప్రొఫెసర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ ఆచార్యుడి పేర్లు ఫైనల్ పరిశీలనలో సెర్చ్ కమిటీ చేర్చినట్లు తెలుస్తోంది. పొలిటికల్ సైన్స్ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్‌తో పాటు వర్కింగ్ ప్రొఫెసర్ ఒకరు వీసీ పోస్ట్ కోసం తమ వర్గం నేతతో పైరవీలు చేస్తున్నారు. మరో వర్గం నేతను పట్టుకొని కోరుట్లకు చెందిన కాకతీయ ప్రొఫెసర్ ఒకరు, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో రిటైరైన మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం సమర్ధుడిని అపాయింట్ చేయాలని డిసైడైంది.
21 పోస్టులు ఖాళీ
ఆర్టీయూకేటీ, తెలంగాణ మహిళా వర్సిటీ మినహా స్టేట్‌లోని పది వర్సిటీలకు మే 21న వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే జనవరిలో నోటిఫికేషన్ జారీ అయింది. ఇంతలో పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈసీ పర్మిషన్ పొందాక ఫిబ్రవరి 17న గవర్నమెంట్ ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని అపాయింట్ చేసింది. ఇందులో టీయూ తరపున ప్రొఫెసర్ సులేమాన్సిద్ధిఖీ, యూజీసీ నుంచి రాజేశ్వర్ సింగ్ ఛందేల్, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉన్నారు.
టీయూ వీసీ పదవికి మొత్తం 133 మంది దరఖాస్తులు చేయగా సెర్చ్ కమిటీ వడపోత షురూ చేసింది. వీసీ హోదాలో రవీందర్‌గుప్తా అవినీతి వ్యవహారాలు స్టేట్ లెవల్లో వర్సిటీకి మచ్చతెచ్చాయి. జిల్లాలోని ఓ కాలేజీ మేనేజ్మెంట్ నుంచి లంచం తీసుకుంటూ గత యాడాది జూన్ 17న ఆయన ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జ్ వీసీలు కొనసాగుతున్నారు. తెలంగాణ పేరుతో స్థాపించిన వర్సిటీ ఖ్యాతిని విస్తరించే పాలనాదక్షుడి వేటలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఎవరు ఎన్ని పైరవీలు చేసినా సమర్థుడినే సెలెక్ట్ చేయాలనే నిర్ణయంలో గవర్నమెంట్ ఉంది. ఈ క్రమంలో భారీ కసరత్తు చేసినట్లు స్పష్టమవుతోంది.