ముషీరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే తెలంగాణలో వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వడ్డెర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం చైతన్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరి పాటి జైపాల్, భారతీయ వడ్డెర సమాజ సేవా సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ మౌర్య, రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెర కులస్తుల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ప్రభాకర్, యూత్ ప్రెసిడెంట్ శేఖర్, రాష్ట్ర సెక్రటరీ శివరాత్రి వెంకటేశ్, యూత్ సెక్రెటరీ రమేశ్, ఉపాధ్యక్షులు మహేశ్, యూత్ మహిళా అధ్యక్షురాలు రూప, జగన్నాథ్, మహిళా అధ్యక్షురాలు ఆరతి, చంద్రయ్య, రాములు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.