తెలంగాణకు చెందిన ప్రముఖ వాస్తు పండితుడు.. జ్యోతిష్య నిపుణుడు, సంఖ్యాశాస్త్రంలో అగ్రగామి హన్మకొండ జిల్లా కు చెందిన పండితులు.. అనంత మల్లయ్య సిద్దాంతి సిద్ది పొందారు. కాజిపేట శ్వేతార్క రాముల గణపతి దేవాలయాన్ని నిర్మించి... ప్రతిష్టించడంలో అనంత మల్లయ్య సిద్దాంతి కీలక పాత్ర పోషించి.. ఈ దేవాలయ నిర్వాహక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో క్యాలండర్ ను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్దాంతి మల్లయ్య మృతితో ఆయన స్వగ్రామం కాజిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఏడాది తెలంగాణలో ఎండలు మండిపోయాయి. సూర్య భగవానుడి ఉగ్రప్రతాపం తగ్గాలని కోరుతూ కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో మల్లయ్య సిద్దాంతి ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సప్త నదీ జలాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. 108 కొబ్బరి కాయలను కొట్టి ఆ నీటితోనూ అభిషేకం జరిపించారు. ఎండలను తగ్గించాలని స్థానిక భక్తులు దేవుడికి మొక్కుకున్నారు. అనంత మల్లయ్య సిద్దాంతి చెప్పిన ప్రకారం ఇలా చేస్తే ఆ ప్రాంతంలో సూర్య భగవానుడు తన ఉగ్ర రూపాన్ని తగ్గించాడని చెబుతుంటారు.
సూర్యభగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారి కృత్తికా నక్షత్ర సంచారం చేస్తున్న సమయంలో సూర్యుడి తాపము ఎక్కువగా కలిగే అవకాశం ఉందని ఆలయ ప్రధాన అర్చకులు మల్లయ్య సిద్దాంతి తెలిపారు. ఆ సమయంలో దీనికి శాంతి పూజలు నిర్వహించడంలో మల్లయ్య సిద్దాంతి కీలక పాత్ర పోషించారు. ఆ ప్రభావంతో మనుషులకు, పశుపక్షాదులకు,జంతువులకు ఆకలి దప్పుల వైపరీత్యం పరీత్యం ఎక్కువగా కలిగే అవకాశం ఉందని.. అందుకే ఎండ వేడి తగ్గాలని కోరుతూ సప్త నదీ జలాలతో స్వామి వారికి ప్రత్యేక అభిషేకమును నిర్వహించామని చెప్పారు.