
కరుడుగట్టిన కలప స్మగ్లర్, తెలంగాణ వీరప్పన్ గా పిలిచే ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీనును రామగుండం కమిషనరేట్ లా & ఆర్డర్, టాస్క్ ఫోర్సు, మంథని పోలీసులు పకడ్బందీ సమాచారంతో అరెస్ట్ చేశారు. “తెలంగాణ వీరప్పన్- పట్టుబడితే అడవులు సేఫ్” శీర్షికతో వెలుగు దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలు, అడవులు సంరక్షించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో… ఈ అడవి దొంగ ఆట ముగిసింది.
తెలంగాణ వీరప్పన్.. ఎడ్ల శ్రీను అరెస్ట్ వ్యవహారంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం…. గత 20 ఏళ్లుగా విచక్షణ లేకుండా అడవులను నరుకుతూ టేకు స్మగ్లింగ్ లో ఎడ్ల శ్రీను ఆరితేరిపోయాడు. తెలంగాణ పోలీస్, అటవీ శాఖలు మోస్ట్ వాంటెడ్ సగ్లర్ గా గుర్తించాయి. తెలంగాణ వీరప్పన్ అని పిలవబడే ఎడ్ల శ్రీను మూడు రాష్ట్రాలు (తెలంగాణ, మహరాష్ట్ర, చత్తీస్ గఢ్) కు వాంటెడ్ క్రిమినల్. సాంకేతిక, రాష్ట్ర స్థాయి పోలీస్ ఎజెన్సీల సహాయంతో పక్కా ఆధారాలతో రామగుండం కమీషనరేట్ పోలీసులు ఎడ్ల శ్రీను, మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
ఎడ్ల శ్రీను నేర చరిత్ర
తెలంగాణ వీరప్పన్ గా పిలవబడే ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీనివాస్(42) S/o లేట్ రాజయ్య మంథని నివాసి. ఇతను మొదటగా 1999 లో డజొకవ పేరుతో ఫెర్టిలైజర్ వ్యాపారం ప్రారంభించాడు. నష్టాలు రావడంతో తనకున్న పరిచయాలతో అడవినుంచి సైకిల్ ద్వారా కలప అక్రమ రవాణా చేసేవాళ్లతో చేయికలిపాడు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో వ్యాపార సామ్రాజ్యం క్రమంగా విస్తరించాడు.
ఎడ్ల శ్రీనుపై ఉన్న కేసుల వివరాలు:
ఇప్పటివరకు ఎడ్ల శ్రీను పై పోలీస్,అటవీశాఖ వారు నమోదుచేసిన చేసిన మొత్తం కేసులు 12.
మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు:
1.CR.NO 04/19 SEC OF LAW 109,38g C SEC 07 R/W 20 (1)(C) (m) SEC 20 OF AP FOREST ACT
2.CR. NO 19/19 SEC OF LAW 420,506 IPC
3.CR. NO 25/19 SEC oF LAW 143,147, 379, 382 R/w 149 IPC SEC 07 R/W 20 (1)(C) (III),SEC 20 OF AP FOREST ACt
4.CR.NO 26/19 SEC OF LAW 143, 147,379 382 R/w 149 IPC SEC 07 R/W 20 (1)(C) (III),SEC 20 OF AP FOREST ACt
5.CR.NO 242/12 SEC OF LAW 379 IPC
6.CR.NO 54/19 SEC OF LAW 379 IPC
కోటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు:
- CR.NO 11/19 SEC OF LAW 379 IPC SEC 21 & 22 OF AP FOREST ACT
- CR.NO 13/19 SEC OF 379 IPC SEC 21 & 22 OF AP FOREST
అటవీ శాఖ వారు నమోదు చేసిన కేసుల వివరాలు
9.POR.NO 40/19, 1999లో మంథని రేంజ్
10.POR.NO 40/42, 2001లో మంథని రేంజ్
11.POR.NO 101/10, 2001లో మంథని రేంజ్
12.POR.NO 45/182, 2002లో మంథని రేంజ్
ఎడ్ల శ్రీను అక్రమ కలప రవాణా ఎక్కువగా చేసిన అటవీ ప్రాంతాలు :
మంథని రిజర్వుడ్ ఫారెస్ట్ లోని మహదేవపూర్ దామెరకుంట,ఆరెంద, గూడూర్,అడవి ముత్తారం, ఖానాపూర్, రాపల్లి కోట,వీరాపూర్, అంబటిపల్లి, బొమ్కాపూర్ సర్వాయిపేట మహారాష్ట్రలోని నడికూడా, అసేరేల్లి, చత్తీస్ గఢ రాష్ట్రంలోని తాళ్లగూడ ప్రాంతాలు.
అక్రమ టేకు కలప దిగుమతి చేసుకునే సామిల్స్ వివరాలు
- సాయిరాం సామిల్స్, గోదావరిఖని
- శ్రీ బాలాబ్ సామిల్స్, గోదావరిఖని
- శనిగ నారాయణరెడ్డి, సామిల్ ఎర్రగుంటపాలెం ,ప్రకాశం జిల్లా
అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు:
- ఎడ్ల శ్రీను s/o లేట్ రాజయ్య , పోతారం, మంథని
- కుడేదల కిషన్ s/o ఖాన్ సాయి పెట్, మంథని
- కొరవేని మధుకర్ s/o సత్తయ్య విలోచావరం
- ఎడ్ల సంతోష్ s/o మల్లయ్య, లద్నాపూర్
మూఢనమ్మకాల (క్షుద్ర పూజలు) ప్రభావం:
అక్రమ కలప సామ్రాజ్యం 20 సం.లుగా నడిపిస్తున్న ఎడ్ల శ్రీనుకి ఒక విచిత్రమైన నమ్మకం వుంది. అది మూఢ నమ్మకాల ప్రభావం ఉంటుందని నమ్మడం. మంథని, భూపాలపల్లి ప్రాంతాలలో సుపరిచితుడైన ఎడ్ల శ్రీనుకి కలప సగ్లర్ గా దిష్టి తగులుతుందని సమీప బంధువులు చేతబడి, క్షుద్రపూజలు చేస్తున్నారని కొంతమంది పూజారులు అతనిని నమ్మించి అతడి వద్ద నుంచి అధికమొత్తంలో డబ్బులను దండుకోవడం జరిగింది. క్షుద్ర పూజలు చేయడం వలన పోలీస్, అటవీ శాఖ వారి నుండి ఇటువంటి ప్రమాదం ఉండదని నమ్మించి సుమారు 12 మంది వివిధ ప్రాంతాల పూజారులు.. కొన్ని లక్షల రూపాయలు అతని వద్ద నుండి డబ్బులు వసూలు చేసినట్టు దర్యాప్తులో తేలింది.
అక్రమ స్థావరాలు గుర్తింపు కోసం డ్రోన్ కెమెరా :
సాంకేతిక పద్ధతి ఐన జియో ట్యాగింగ్, డ్రోన్ కెమెరా ద్వారా గోదావరి ప్రాంతంలో ఇసుకలో దాచిన టేకు దుంగల ఆనవాళ్ళు గుర్తించి పట్టుకున్నారు. కలప నిల్వ స్థావరాలు, రవాణా మార్గాలను జియో ట్యాగింగ్ చేసి తద్వారా వీరిపై నిరంతర నిఘా పెట్టడం జరిగింది.
ఇంకా దర్యాప్తు చాలా ఉంది:
కలప స్మగ్లింగ్ సంబంధించి నేరస్తులలో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశారు. సుమారుగా 20 మందిని త్వరలో అరెస్ట్ చేయడానికి జాబితా సిద్ధం చేశామని అదేవిధంగా కలప అక్రమ రవాణా సామ్రాజ్యం సంబందించిన పూర్తి సమావారు కోసం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు రామగుండం కమిషనరేట్ పోలీసులు.