నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా ఏసీబీకి పట్టుబడ్డారు. పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సంబంధించి రూ.50 వేలు లంచం తీసుకుంటూ జూన్ 17న అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు రెడ్‌హ్యండెడ్‌గా దొరికారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలో ఈ తతంగం నడుస్తుండగా అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని భీమ్‌గల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆయన డిమాండ్ చేయడంతో అడిగిన మొత్తాన్ని నిర్వాహకులు ఇస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆయన్ని అదుపులోకి తీసుకున్న అనంతరం నివాసంలో మళ్లీ తనిఖీ నిర్వహిస్తున్నారు. గతకొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
వర్సిటీ రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలకమండలి, వీసీకి విబేధాలొచ్చాయి. రోజురోజుకీ పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో వీసీ కాస్త వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే తాజాగా వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం. ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.