తెలంగాణ ఓటర్ లిస్ట్ ల తయారీలో బిఎల్ఓ ల పని తీరు అధ్వానంగా తయారైంది. చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో కొనసాగించడం, గ్రామం పేరుతోనే కొత్త ఓటరు నమోదు చేయడం లాంటి చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. స్థానిక బీఎల్ఓ ఓటర్ లిస్ట్ లో కొడిమ్యాల పేరుతోనే కొత్త ఓటర్ నమోదు చేశారు.
Also Read : చంద్రబాబుతో పవన్, బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్
ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సుమారు 5 నుండి 10 మంది వరకు చనిపోయిన వ్యక్తుల పేర్లను చేర్చడం వారి పనితీరుకు అంతం పడుతుంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చనిపోయిన వారి పేర్లు తొలగించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.