
- జీపీవో విధి విధానాలపై వీఆర్వో, వీఆర్ఏ సంఘాల మిశ్రమ స్పందన
హైదరాబాద్, వెలుగు: జీపీవోల నియామకానికి సంబంధించిన విధివిధానాలపై వీఆర్వో, వీఆర్ఏల సంఘాల నాయకుల స్పందన మిశ్రమంగా ఉంది. ఈ జీవోను తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్జేఏసీ తప్పుపట్టింది. గత సర్వీసుని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా భావిస్తున్నామని పేర్కొన్నది. క్వాలిఫికేషన్, ఎగ్జామ్ పేరుతో అవమానపరుస్తూ కొంతమంది అధికారులు చేస్తున్న కుట్రలో భాగంగానే ఉత్తర్వులు వచ్చాయని తెలిపింది. సర్వీసు జాబ్ చార్ట్ మేటర్ లో విలేజ్ అకౌంట్స్ లేని విధానాన్ని మళ్లీ జీవోలో పెట్టడం సరికాదన్నారు.
జీవో నంబర్ 129కి సవరణ చేసి ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా, పూర్తిస్థాయి సర్వీస్ తో పాటు రద్దయిన ప్రతి వీఆర్వోను గ్రామ రెవెన్యూ వ్యవస్థలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్కోరారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం బాధ్యులు గరికె ఉపేంద్ర రావు, వి.లక్ష్మీ నరసింహులు మాత్రం జీవో 129ను స్వాగతించారు. ఉగాది కంటే ముందే పాత వీఆర్వోలు, వీఆర్ఏలకు పండగ వాతావరణం తీసుకువచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, పాత సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.