- 14 రోజుల పాటు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే ప్రారంభమైంది. కుష్టువ్యాధి లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 2 నుంచి 15 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నారు.
జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్ లు ఇండ్లు తిరుగుతూ కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారు. ఎర్ర మచ్చలు, తెల్ల మచ్చలు, స్పర్శలేని కణతులు, నరాల బలహీనత కలిగిన వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఒకవేళ లెప్రసీ అని గుర్తిస్తే, స్థానిక ప్రైమరీ హెల్త్‌సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తారు.