జాతీయ స్థాయి హ్యాండ్​ బాల్​ పోటీల్లో..తెలంగాణ విజయం

  • పైనల్స్ లో బాయ్స్​, గర్ల్స్​ విభాగాల్లో  గెలుపు పొందిన రాష్ట్ర జట్లు  

మహబూబ్​నగర్, వెలుగు : ఐదు రోజులుగా జరిగిన స్కూల్ ​గేమ్స్​ ఫెడరేషన్ ​జాతీయ స్థాయి హ్యాండ్​ బాల్​ పోటీలు హోరాహోరీగా సాగి బుధవారం ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 35 బాలుర జట్లు, 36 బాలికల జట్లు పాల్గొన్నాయి. బాయ్స్​ విభాగంలో ఫైనల్స్​లో ఏపీ టీమ్ పై ​తెలంగాణ జట్టు విజయం సాధించింది. గర్ల్స్​ విభాగంలో రాజస్థాన్ టీమ్ పై  తెలంగాణ జట్టు గెలుపొందింది.  రెండు విభాగాల్లోనూ రాష్ట్రానికి చెందిన జట్లు జయకేతనం ఎగురవేశాయి.

టోర్నీలో గెలుపొందిన టీమ్ లకు  ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్​  చైర్మన్ ​ఒబేదుల్లా కొత్వాల్​, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఒలంపిక్ అసోసియేషన్​జిల్లా అధ్యక్షుడు ఎన్​పీ వెంకటేశ్​, డీఐఎస్​వో శ్రీనివాస్, హ్యాండ్ బాల్ జిల్లా అధ్యక్షుడు పుట్టమర్రి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.