
మునగాల(నడిగూడెం), వెలుగు: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన జాన్ పూర్ జడ్పీ చైర్‌పర్సన్‌గా తెలంగాణ మహిళ ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామానికి చెందిన కోదాడ మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కూతురు, బీజేపీ లీడర్ శ్రీకళారెడ్డి. ఆమె యూపీకి చెందిన ధనుంజయ్‌ను పెండ్లి చేసుకున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో శ్రీకళారెడ్డి పోటీ చేసి విజయం సాధించడమే కాకుండా కాన్పూర్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీలో చేరిన ఆమె కోదాడ టికెట్ ఆశించి, రాకపోవడంతో తర్వాత బీజేపీలో చేరారు. ఆ టైంలో హెలికాప్టర్లోంచి డబ్బులు, పూలు చల్లి వార్తల్లోకెక్కారు.