హైదరాబాద్: విద్యార్థులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని.. కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులు పెడితే నేరుగా తనకు కాల్ చెయ్యండని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇటీవల ఇంటర్ విద్యార్థిని అనూష ఆత్మహత్యకు పాల్పడటంతో ఇవాళ (అక్టోబర్ 22) ఆమె కాలేజీకి వెళ్లారు. అనూష మృతిపై ఆరా తీశారు.
ALSO READ | పటిష్టమైన విద్య కోసమే విద్యా కమిషన్
ఈ సందర్భంగా.. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిననేరేళ్ల శారద.. నారాయణ జూనియర్ కళాశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని అనూష ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. అనూష మృతి నేపథ్యంలో బాచుపల్లి నారాయణ జూనియర్ కళాశాల స్టాఫ్ మొత్తాన్ని మార్చాలని ఆమె ఆదేశించారు. తాను మీడియాతో మాట్లాడుతుండగా వీడియో రికార్డు చేసిన కళాశాల సిబ్బందిపై నేరేళ్ల శారద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.