
- అభినందించిన నేషనల్ మహిళ కమిషన్అ
- యోధ్యలో మహిళ కమిషన్ల సదస్సు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మహిళ కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ విజయ్ కిశోర్ రాహత్కర్ అన్నారు. మహిళల భద్రత, రాష్ట్రంలో జరుగుతున్న పలు ఘటనలపై కమిషన్ స్పందిస్తున్న తీరు, తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని ఆమె అన్నారు. యూపీలోని అయోధ్యలో బుధవారం మొదలై 2 రోజుల పాటు జరగనున్న “కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ పోగ్రాం ఫర్ స్టేట్ ఉమెన్ కమిషన్స్” కార్యక్రమంలో విజయ్ కిషోర్ రాహత్కర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయి మాట్లాడారు.
తెలంగాణలో మహిళ కమిషన్ గత ఏడాది నుంచి చేపట్టిన కార్యక్రమాలను సదస్సులో చైర్ పర్సన్ నేరేళ్ల శారద వివరించారు. మహిళ సంక్షేమాన్ని ప్రొత్సహించటం, ఊహించని ఘటనలు జరిగిన సమయంలో స్పందించి నోటీసులు ఇవ్వటం వంటి చేస్తున్నట్టు తెలిపారు.