మంత్రి క్షమాపణ చెప్పకుంటే తీవ్రంగా స్పందించే వాళ్లం : తెలంగాణ మహిళా కమిషన్

మంత్రి క్షమాపణ చెప్పకుంటే తీవ్రంగా స్పందించే వాళ్లం : తెలంగాణ మహిళా కమిషన్

సికింద్రాబాద్, వెలుగు: సినీ నటి సమంతకు మంత్రి కొండా సురేఖ బేషరతు క్షమాపణలు చెప్పకుంటే తీవ్రంగా స్పందించేవాళ్లమని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. ఈ మేరకు గురువారం కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించామని చెప్పింది. ఈ వ్యవహారంలో కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. హీరో అక్కినేని నాగార్జున కుటుంబం కొండా సురేఖకు లీగల్ నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతమని వెల్లడించింది.