మహిళా సంఘాలకు 600 బస్సులు.. ఆర్టీసీకి అద్దెకిచ్చి ఆదాయం పొందేలా ప్లాన్​

మహిళా సంఘాలకు 600 బస్సులు.. ఆర్టీసీకి అద్దెకిచ్చి ఆదాయం పొందేలా ప్లాన్​

 

  • సెర్ప్ ద్వారా కొనుగోలు చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
  • ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షలు.. ఆర్టీసీ చెల్లించే అద్దె రూ.77,220
  • 8న కొత్త స్కీమ్​ను ప్రారంభించనున్న సీఎం రేవంత్​

హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాలతో బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకిచ్చి ఆదాయం పొందేలా సర్కారు కొత్త స్కీమ్​ను రూపొందించింది. ఈ కొత్త పథకాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయనున్నారు. తొలి విడతలో 150 బస్సులను కొనేందుకు అనుమతిస్తూ మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. 

ఒక్కో బస్సుకు నెలకు రూ.77,220 అద్దె

మండల మహిళా సమాఖ్యల ద్వారా బస్సుల కొనుగోలుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (స్పెర్) ద్వారా బ్యాంకు లోన్లు ఇప్పించనున్నారు. ఈ లోన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. ఒక్కో బస్సును రూ.36 లక్షలతో కొనుగోలు చేయనున్నారు. బస్సుల నిర్వహణ, ఇతర కార్యకలాపాలను ఆర్టీసీనే చూసుకోనుంది. బస్సుల కొనుగోలుకు మండల మహిళా సమాఖ్యలు పెట్టిన పెట్టుబడి మొత్తానికి ఆర్టీసీ ఏడేండ్ల పాటు ప్రతినెలా ఐదో తేదీకి ముందు 15 శాతం ఈఎంఐని సమకూర్చనుంది. ఈ లెక్కన ఒక్కో బస్సుకు ఆర్టీసీ రూ.77,220 చొప్పున అద్దె చెల్లించనుంది. 

మొదటి విడతలో 4 జిల్లాల్లో స్కీమ్ ​అమలు 

రెండు విడతల్లో కలిపి 600 బస్సుల కొనుగోలుకు రూ.216 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలుత ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో పరిధిలోని పలు డిపోలకు ఈ అద్దె బస్సులను కేటాయిస్తారు. ఈ నెల 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో లక్ష మంది మహిళలతో నిర్వహించే సభలో సీఎం రేవంత్​రెడ్డి 50 బస్సులను ప్రారంభిస్తారు.   

ప్రత్యేక ఆక‌‌‌‌ర్షణగా డిజైన్లు..

ఇందిరా మహిళా శక్తి స్కీమ్  ప్రాధాన్యతను చాటిచెప్పేలా బస్సుపై డిజైన్లు రూపొందించారు. సెర్ప్ లోగో కూడా బస్సులపై ఉండనుంది. ‘అతివలే అధిపతులు.. మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యం’.. అనే కొటేషన్ తోపాటు మండల సమాఖ్య పేరును బస్సులపై రాయనున్నారు. తెలుపు, ఆకుపచ్చ, మధ్యలో ఎరుపు రంగుతో బస్సును తీర్చిదిద్దారు. మహిళా సంఘాలు నిర్వహించే ఆర్టీసీ బస్సుల నమూనాను మంగళవారం రిలీజ్​ చేశారు. 

దశలవారీగా మరిన్ని బస్సులు కొంటం

ఇప్పటికే 17 ర‌‌‌‌కాల వ్యాపారాల్లో మ‌‌‌‌హిళాల‌‌‌‌ను ప్రోత్సహిస్తున్నం. దేశంలో ఎక్కడాలేని విధంగా మ‌‌‌‌హిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బ‌‌‌‌స్సుల‌‌‌‌ను న‌‌‌‌డ‌‌‌‌పబోతున్నం. ద‌‌‌‌శ‌‌‌‌లవారీగా బ‌‌‌‌స్సుల‌‌‌‌ను మ‌‌‌‌హిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్లాన్​చేశారు. భ‌‌‌‌విష్యత్ లో అన్ని ఆర్టీసీ అద్దె బ‌‌‌‌స్సులను మహిళా సంఘాలకే కేటాయించేలా ఆలోచన చేస్తున్నం. 8న పరేడ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించే సభలో ఇందిరా మ‌‌‌‌హిళా శ‌‌‌‌క్తి- కార్యాచ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌ ప్రక‌‌‌‌టిస్తం. మంత్రి సీతక్క