
ముషీరాబాద్,వెలుగు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మార్చి 25 వరకు నమోదు కొనసాగుతుందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య తెలిపారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ అనుబంధ హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే) సభ్యత్వాన్ని జర్నలిస్టులకు అందజేశారు.
ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్, హెచ్ యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్, పి.విజయ,హెచ్ యూజే ఆఫీస్ బేరర్స్ జీవన్ రెడ్డి, నర్సింహ,వర్కాల కృష్ణ, సతీష్ ముదిరాజ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సునీల్, సంతోష్ పాల్గొన్నారు.