ఏపీ నీటి దోపిడిని అడ్డుకోండి..కృష్ణా బోర్టుకు తెలంగాణ లేఖ

ఏపీ నీటి దోపిడిని అడ్డుకోండి..కృష్ణా బోర్టుకు తెలంగాణ లేఖ

 శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్​ క్లియర్​ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ కెపాసిటీని లక్షన్నర క్యూసెక్కులకు పెంచుకున్న పొరుగు రాష్ట్రం.. దాని కింద నిర్మించిన శ్రీశైలం రైట్​ మెయిన్​ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ) ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తరలించుకుపోయేందుకు వీలుగా వారం నుంచి లైనింగ్​ పనులను స్పీడప్ చేసింది

శ్రీశైలం రైట్ మెయిన్​కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏపీ చేపడ్తున్న లైనింగ్​పనులను కృష్ణా బోర్డు అడ్డుకోకపోవడంపై తెలంగాణ తీవ్రంగా స్పందించింది. లైనింగ్​పనులను ఆపాలంటూ ఇప్పటికే 2023 సెప్టెంబర్, 2024 జులైలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా బోర్డు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. లైనింగ్​పనులను చేపట్టకుండా ఏపీని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం కేఆర్ఎంబీకి ఈఎన్సీ అనిల్​కుమార్​లేఖ రాశారు. 1960 సెప్టెంబర్​తర్వాత చేపట్టిన అన్ని ప్రాజెక్టులకూ ఇన్​సైడ్​ బేసిన్​అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని బచావత్​ట్రిబ్యునల్​అవార్డు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బచావత్​ట్రిబ్యునల్​కూడా కేవలం ఇన్​సైడ్​బేసిన్​ప్రాజెక్టులకే నీటి కేటాయింపులను చేసిందని స్పష్టం చేశారు. శ్రీశైలం కేవలం జలవిద్యుదుత్పత్తి కోసమే నిర్మించారని, ఔట్​సైడ్​ బేసిన్​కు నీటిని తరలించరాదంటూ ట్రిబ్యునల్​స్పష్టం చేసిందని పేర్కొన్నారు. 

►ALSO READ | చేబ్రోలు కిరణ్ పై దాడి.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్..

1976–77 ఒప్పందం ప్రకారం ఒపెన్​కెనాల్​ద్వారా చెన్నైకి 1500 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే తరలించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ.. శ్రీశైలం నుంచి పెన్నా బేసిన్​కు నీటిని తరలించే శ్రీశైలం రైట్​బ్రాంచ్​కెనాల్​(ఎస్ఆర్​బీసీ)కి శ్రీకారం చుట్టి.. సీడబ్ల్యూసీ ఆమోదం కోసం పంపిందని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ భాగమైనందున సీడబ్ల్యూసీకి గానీ, ట్రిబ్యునళ్ల​ముందుగానీ తమ వాదన వినిపించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఏపీ తన తీరు మార్చుకోకుండా శ్రీశైలం రైట్​మెయిన్​కెనాల్​కు లైనింగ్​వర్క్స్​ను పూర్తి చేసేలా వేగంగా పనులను చేపడుతున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం అపెక్స్​కౌన్సిల్​అనుమతి లేకుండా, కృష్ణా బోర్డు ఆమోదం తెలపకుండా ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచేలా కెనాల్​కు ఎలాంటి లైనింగ్​పనులను చేపట్టడానికి అధికారం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ఏపీ వెంటనే ఆ పనులను నిలుపుదల చేసేలా కృష్ణా బోర్డు జోక్యం చేసుకోవాలని, ఏపీని అడ్డుకోవాలని డిమాండ్​చేశారు. దాంతోపాటు రాయలసీమ లిఫ్ట్​ఇరిగేషన్ స్కీమ్ , ఎస్ఆర్​ఎంసీపై కేంద్ర జలశక్తి శాఖ, తెలంగాణకు ఏపీ స్టేటస్​ రిపోర్ట్​ ఇచ్చేలా  ఆదేశించాలని కోరారు.