అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. భారత కాలమాన ప్రకారం ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది.  మృతురాలిని  గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లె. ఉన్నత చదువు కోసం సౌమ్య ఆమెరికాకు వెళ్లింది. 

అక్కడే చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తుంది. అయితే మే 26న అర్థరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో  సౌమ్య అక్కడిక్కడే మృతి చెందంది.  ఈ  విషయం తెలుసుకున్న  సౌమ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సౌమ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సౌమ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేశారు.