
వికారాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు తెలంగాణ యువకుడు పూనుకున్నాడు. వికారాబాద్జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి తన ఏడు మంది బృందంతో కలిసి ఈనెల8వ తేదీన బయలుదేరి వెళ్లారు. బుధవారానికి 17 వేల అడుగులు దేశ్ క్యాంపు చేరుకోనున్నారు. ఇప్పటికే ఇతను దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, ఆస్ట్రేలియాలోని మౌంట్ కోజియా స్కో , సిక్కింలోని మౌంట్ రేనల్ పర్వతాలను ఎక్కాడు.