అభినందించిన ములుగు, వరంగల్ కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ప్రావీణ్యములుగు/మంగపేట, వెలుగు : ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఎల్‌బ్రస్‌ను ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడెం గ్రామానికి చెందిన వాసం వివేక్‌కుమార్ అధిరోహించాడు. రష్యా, జార్జియా సరిహద్దులోని 5,642 మీటర్ల (18,510 అడుగులు) ఎత్తు ఉండే ఈ పర్వతాన్ని వివేక్ ఈ నెల 15న ఎక్కాడు.
వివేక్‌కుమార్ శుక్రవారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలువగా వారు శాలువాతో సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ అడిషనల్ కలెక్టర్కోట వాత్సల్య, ములుగు ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఈవీ.శ్రీనివాసరావు, కె.ప్రసాదరావు, కొట్టె రాజిరెడ్డి, బండి ఈశ్వర్, కుసుమ శ్యాంసుందర్ పాల్గొన్నారు.