న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల్లో తెలంగాణకి రూ.29,899.77 (2.102 శాతం) కోట్ల వాటా రానుంది. అందులో కార్పొరేషన్ పన్ను రూ.8,349.04 కోట్లు, ఆదాయపు పన్ను రూ.11,140.06 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.8,704.59 కోట్లు, కస్టమ్స్ రూ.1,376.22 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.285.91 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.0.86 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీస్ రూ.43.09 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి.