
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. కానిస్టేబుల్ కొడుకు కలెక్టర్ ఉద్యోగానికి ఎంపిక కావడంపట్ల రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ (మంగళవారం, ఏప్రిల్ 22) విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కొడుకు సివిల్స్ కు ఎంపిక కావడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు చెందిన హేడ్ కానిస్టేబుల్ జాదవ్ గోవింద్ కొడుకు చైతన్య జాదవ్ సివిల్స్ లో 68 ర్యాంక్ సాధించాడు. దీంతో ఊట్నూరులో ఆనందోత్సవాలు మొదలయ్యాయి. తండ్రి కానిస్టేబుల్ అయినప్పటికీ కొడుకు కష్టపడి కలెక్టర్ కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. సాధారణ కానిస్టేబుల్ కొడుకు కలెక్టర్ కావడం గర్వకారణం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్కు చెందిన సాయిశివాణికి 11వ ర్యాంక్:
యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయిశివాణి జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ తో సత్తా చాటింది. వరంగల్ నగరంలోని ఇట్టబోయిన రాజ్‌కుమార్, - రజితల ప్రథమ పుత్రిక ఇట్టబోయిన సాయిశివాణి జాతీయస్థాయిలో టాప్ 20 ర్యాంకు సాధించి గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందని, తమ కూతురు కలెక్టర్ కాబోతుందంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
►ALSO READ | UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు రిలీజ్..ఫస్ట్ ర్యాంక్ శక్తిదూభే..ఎవరీమె