లేహ్ : తెలంగాణ యంగ్ స్కేటర్ తల్లూరి నయన శ్రీ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో వరుసగా మూడో సీజన్‌లోనూ మెరిసి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్‌తో చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 500 మీటర్ల షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్‌లో 1 నిమిషం 01.5 సెకండ్లతో నయన స్వర్ణం నెగ్గింది. ఈ పోటీల్లో మూడేండ్ల నుంచి నయన సత్తా చాటుతోంది.
2023 గుల్మార్గ్‌లో జరిగిన పోటీల్లో తొలి స్వర్ణం అందుకున్న ఆమె గతేడాది అండర్17, 17 ప్లస్ కేటగిరీల్లో రెండు బంగారు పతకాలు గెలిచింది. 2024 ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పోటీ పడి 3000 మీ విమెన్స్ రిలేలో స్వర్ణం అందుకుంది.