![నేషనల్ గేమ్స్ లో నిష్కాకు స్వర్ణం, నిఖిల్‌కు కాంస్యం](https://static.v6velugu.com/uploads/2025/02/telanganas-nishka-agarwal-wins-gymnastics-gold-at-38th-national-games_hSMTHl4KiV.jpg)
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యంగ్ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది. బుధవారం జరిగిన విమెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో నిష్కా 12.717 స్కోరుతో అగ్రస్థానంతో స్వర్ణం సొంతం చేసుకుంది.
ఒడిశా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ (12.700), వెస్ట్ బెంగాల్‌కు చెందిన సమంత (12.484) రజతం, కాంస్యం గెలిచారు. మరోవైపు రెజ్లింగ్‌లో తెలంగాణ కుర్రాడు నిఖిల్ యాదవ్ కాంస్యం నెగ్గాడు. మెన్స్ ఫ్రీ స్టయిల్ 65 కేజీ ఈవెంట్ కాంస్య పతక బౌట్‌లో నిఖిల్ 12 పాయింట్ల టెక్నికల్ సుపీరియారిటీతో కర్నాటక లిఫ్టర్ మహేశ్‌ను ఓడించాడు.