కేసీఆర్​ను ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించండి.. హైకోర్టులో పిల్​ దాఖలు

కేసీఆర్​ను ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించండి.. హైకోర్టులో పిల్​ దాఖలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి..ప్రతిపక్షనేత.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్)ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిల్​ దాఖలైంది.  కేసీఆర్​ అసెంబ్లీకి రావడంలేదని విజయ్​పాల్​రెడ్డి దాఖలు చేసిన పిల్​ను హైకోర్టు విచారణ చేపట్టింది.  కేసీఆర్​ ప్రతిపక్ష నేతగా ఉన్నాడని పిటిషనర్​ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

అసెంబ్లీ వేదికగా చట్ట సభలో ప్రజాసమస్యలను చర్చించాల్సిన బాధ్య ప్రతిపక్షనేతకు ఉంటుందని పిటిషనర్​ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హుడిగా ప్రకటించవచ్చని పిటిషనర్​ తరపు న్యాయవాది అన్నారు.  కేసీఆర్​ ను అనర్హుడిగా ప్రకటించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీచేయాలని హైకోర్టును కోరారు. 

ఈ పిల్​ ను విచారిస్తున్న ధర్మాసనం  ఇందులో జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ప్రశ్నించింది.   ప్రజాప్రయోజన వ్యాజ్యానికి ​ అర్హత లేదని  శాసనసభ వ్యవహారాల తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈ పిల్ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని... ఈ మేరకు వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరిన పిటీషనర్ న్యాయవాది కోర్టును కోరారు.  ఇరు వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.