యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్..నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిలా.?: హైకోర్ట్

యూట్యూబర్  హర్షసాయి కేసులో ట్విస్ట్..నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిలా.?: హైకోర్ట్

యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్టులు  జరుగుతున్నాయి.  ఈ కేసులో   ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, ఇమ్రాన్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. అయితే విచారించిన హైకోర్ట్ కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది.  ముందస్తు బెయిల్  పిటిషన్ ను కొట్టివేసింది హైకోర్ట్.  కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్ కు రావాలని సూచించింది.  ఇప్పటికే  హర్ష సాయి తోపాటు హర్ష తండ్రి, ఇమ్రాన్ పై  బాధితురాలు ఫిర్యాదు చేసింది. 

మరో వైపు  ఇప్పటికే  రూ. 2 కోట్లు తీసుకుని మోసం చేశాడని  హర్ష సాయిపై  కేసు పెట్టిన బాధితురాలు..  అక్టోబర్ 4న మరో కేసు పెట్టింది. తనపై ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నాడని ఓ సోషల్ మీడియా ఇంఫ్లేన్సర్ యువతి హైదరాబాద్ లోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో హర్ష సాయి తన అనుచరలతో కలసి తనపై నెగిటివ్ ట్రోలింగ్‌ చేయిస్తున్నాడని  బాధితురాలు ఆరోపించింది. అంతేగాకుండా ఈ విషయానికి సంబంధించి పలు స్క్రీన్ షాట్లు కూడా బాధితురాలు పోలీసులకి షేర్ చేసింది. ఈ క్రమంలో తనపై నెగిటివ్ ట్రోలింగ్ కి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులను కోరింది. దీంతో భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.

Also Read : దసరా హాలిడేస్ స్పెషల్.. సినిమా టికెట్ రేట్లు తగ్గింపు