బిట్బ్యాంక్​: తెలంగాణ మహాసభ

బిట్బ్యాంక్​: తెలంగాణ మహాసభ

ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అణచివేత విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం 1968–69 మధ్యకాలంలో ఉద్యమం జరిగింది. 
     నీలం సంజీవరెడ్డి తర్వాత దామోదరం సంజీవయ్య ఏపీ సీఎం అయ్యారు. 
    దామోదరం సంజీవయ్య సీఎంగా ఉన్న కాలంలో కొండా వెంకట రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. 
    కొండా వెంకట రంగారెడ్డి 1959 నుంచి 1962 వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 
     1962 తర్వాత 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవిని పక్కనపెట్టారు. 
     1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉప ముఖ్యమంత్రిగా సమైక్యతావాది అయిన కరీంనగర్​కు చెందిన జేవీ నరసింగరావును నియమించారు. 
     బూర్గుల రామకృష్ణారావు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపకుండా వివక్ష చూపారు. 
     భారత్, పాకిస్తాన్ యుద్ధ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో 10 శాతం కోత విధించి పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగులను తొలగించడంతో తెలంగాణలో చాలా మంది ఇంజినీర్లు 1965–66 మధ్యకాలంలో నిరుద్యోగులయ్యారు. 
     1967 నాటికి తెలంగాణలో ఆంధ్ర టీచర్ల సంఖ్య 4000కు చేరుకుంది. 
     ఉద్యోగ ఖాళీల భర్తీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనను తొక్కివేయడంతోపాటు ప్రజా ఉద్యోగ చట్టం –1957ను కూడా ఉల్లంఘించారు. 
     రెండు ప్రాంతాల సివిల్ సర్వీస్ అధికారుల సీనియారిటీలను కలిపేసి, కామన్ సీనియారిటీ జాబితాను రూపొందించి, ఆంధ్రా ప్రాంతపు నియమ నిబంధనలను అమలు చేయడంతో ప్రమోషన్లలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. 
    1950 హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టంలోని ఐదో అధ్యాయం 47 నుంచి 50 సెక్షన్ల ప్రకారం తెలంగాణ వ్యవసాయ భూములను తెలంగాణేతరులు కొనడం చట్ట విరుద్ధం. 
     1950 హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టాన్ని ఉల్లంఘించి, 1956కు ముందు ఆంధ్రవారు నిజామాబాద్, వరంగల్  జిల్లాల్లో భూములు కొనుగోలు చేశారు. 
     పెద్ద మనుషుల ఒప్పందంలోని 8వ అంశం ప్రకారం తెలంగాణలోని వ్యవసాయ భూములను అమ్మడం, కొనడం తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారానికి లోబడి ఉండాలి. 
     తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనుమతి లేకుండా ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద మొత్తంలో భూమిని కౌరుచౌకగా కొనుగోలు చేశారు. 
     1950 హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టంలోని 47 నుంచి 50 వరకు గల సెక్షన్లను 1968లో పూర్తిగా రద్దు చేశారు.
     వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో 60 నుంచి 80శాతం మాగాణి భూమి స్థానిక రైతుల నుంచి ఆంధ్రా వలసవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 
     నిజాంసాగర్ కింద సారవంతమైన భూమిలో 40 శాతం వలసవాదుల చేతుల్లోకి వెళ్లింది. 
     ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 17 నెలలకు నాటి పాలకులు జరిపిన అన్యాయాలను వేలెత్తి చూపే సాహసం చేసిన సంస్థ తెలంగాణ మహాసభ. 
     తెలంగాణ మహాసభ ఆనాటికి పాలకులు చేస్తున్న అన్యాయాలపై కేంద్ర విదేశాంగ మంత్రి గోవింద వల్లభ్ పంత్​కు విజ్ఞాపన పత్రాన్ని పంపింది. 
    పరిస్థితి చేయి జారక ముందే మేల్కొనండి అంటూ 1959 డిసెంబర్ 12న ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసిద్ధ న్యాయవేత్త గులాం పంజాతన్ బహిరంగ లేఖ రాశారు. 
    తెలంగాణ ప్రజలకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాలను విచారించి, వాటిని అరికట్టేందుకు ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలని 1960లో ప్రధాని జవహర్​ లాల్ నెహ్రూకు తెలంగాణ మహాసభ విజ్ఞాపన పత్రం పంపింది.