బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ గత పదేళ్లుగా సమన్వయంతో ముందుకెళ్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు రేవంత్.
కేటీఆర్ ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్ పై ఒత్తిడి చేశారు.. కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని కేసీఆర్ మోదీని కోరారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎంను మార్చాలనుకునే పార్టీ అంతర్గత వ్యవహారంలోనూ కేసీఆర్ మోదీ అనుమతి కోరారని చెప్పారు. గతంలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి ఓటేస్తే..ఆ ముగ్గురు ఎమ్మెల్యేలలను కేసీఆర్ సస్పెండ్ చేశారని గుర్తు చేశారు రేవంత్
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి బంధం లేదని రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఓడించిందని చెప్పారు. సీఎంను మార్చుకోవాలంటే ఎవరి అనుమతి అవసరం లేదని.. బీఆర్ఎస్ కే గత ప్రభుత్వం హయాంలో 100 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉందన్నారు.
Also Read :