ఫోన్ లేని వాళ్లు ఎవరూ లేరు కదా.. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నంది. ఇక నుంచి మీరు ఫోన్ చేస్తే కనిపించేది నెంబర్ కాదు.. మీరు, మీ వివరాలు. అవును.. ఈ దిశగా టెలికాం కంపెనీలు అమలు చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయబోతున్నది.
మీ ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్న నెంబర్లకు మాత్రమే పేరు కనిపిస్తుంది.. ఇది ఇప్పటి వరకు ఉన్న విధానం. ఇక నుంచి మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చినా.. వారి పేరు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఓ మార్కెటింగ్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది అనుకోండి.. ఇప్పుడు అయితే కేవలం నెంబర్ మాత్రమే కనిపిస్తుంది.. ఇక నుంచి ఆ మార్కెటింగ్ కంపెనీ పేరు, వారి వివరాలు డిస్ ప్లే అవుతాయి అన్నమాట. ఆ నెంబర్ ఏ పేరుతో అయితే రిజిస్ట్రర్ అవుతుందో.. పేరు కావొచ్చు.. కంపెనీ పేరు కావొచ్చు.. ఏదైనా కానీ.. ఇక నుంచి పేరుతోనే మీ ఫోన్‌పై డిస్ ప్లే అవుతుంది అన్నమాట. ఫేక్ కాల్స్, మార్కెటింగ్ కాల్స్‌ను కట్టడి చేయటం కోసం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నది కేంద్ర టెలికాం శాఖ.
రోజు రోజుకు పెరిగిపోతున్న స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఈ మేరకు టెలీకాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలర్ ఐడీ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) సేవను వెంటనే అమలు చేయాలని అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది.
ప్రస్తుతం.. మన ఫోన్లో ఒకరి నెంబర్ సేవ్ చేసుకుంటే.. వాళ్లు కాల్ చేసినప్పుడు మనం సేవ్ చేసుకున్న పేరు ఫోన్లో డిస్ ప్లే అవుతోంది. అదే మనం నెంబర్ సేవ్ చేసుకోకపోయిన.. తెలియని కొత్త నెంబర్ల నుండి ఫోన్ వచ్చిన కాల్ చేసింది ఎవరనే విషయం మనం గుర్తించలేం.
ALSO READ | Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
ప్రస్తుతం Truecaller, Bharat Caller ID, Anti Spam వంటి థర్డ్-పార్టీ యాప్‌లు ఉపయోగించి కొత్త నెంబర్ల నుండి వచ్చిన వారి వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ యాప్‌లలో కూడా కాల్ చేసిన అవతలి వ్యక్తి వివరాలు అంత కరెక్ట్‌గా తెలియజేస్తాయని చెప్పలేం. వీటిని ఆసరాగా తీసుకుని మార్కెటింగ్ చేసే వారు, సైబర్ నేరగాళ్లు కొత్త నెంబర్ల నుండి ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రోజు రోజుకు ఈ స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ సమస్య వినియోగదారులకు తీవ్రం అవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కాలర్ ఐడీ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ విధానం అమల్లోకి వస్తే.. మనం ఫోన్లో నెంబర్ సేవ్ చేసుకున్న, చేసుకోకపోయిన ఫోన్ చేసిన వ్యక్తి పేరు డిస్ ప్లే అవుతోంది. మనకు ఫోన్ చేసిన వ్యక్తి సిమ్ కార్డు తీసుకున్నప్పుడు సమర్పించిన డిటెయిల్స్ మన ఫోన్లో కనిపిస్తాయి. ఈ ఫీచర్‌ను గత ఏడాది నుంచే టెలికాం కంపెనీలు పరీక్షిస్తుండగా.. కాలర్ ఐడీ నేమ్ ప్రెజెంటేషన్ సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా టెలికం కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆదేశించింది. ఈ విధానంతో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ సమస్యకు కాస్త చెక్ పడొచ్చని నిపుణులు అంటున్నారు.