స్పెక్ట్రమ్ కోసం రూ. 11,000 కోట్ల విలువైన బిడ్స్​ 

స్పెక్ట్రమ్ కోసం రూ. 11,000 కోట్ల విలువైన బిడ్స్​ 

న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్లు స్పెక్ట్రమ్ వేలం  మొదటి రోజున ఐదు రౌండ్లలో రూ. 11 వేల కోట్ల విలువైన బిడ్‌‌‌‌‌‌‌‌లు వేశారు.  పదో విడతలో ప్రభుత్వం  96,238 కోట్ల విలువైన 10,500 మెగాహెర్ట్జ్​ స్పెక్ట్రమ్‌‌‌‌‌‌‌‌ను అమ్మకానికి పెట్టింది. బుధవారం వేలం తిరిగి ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.   డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ టెలికాం జారీ చేసిన మొదటి రోజు స్పెక్ట్రమ్ వేలం నివేదిక ప్రకారం, బిడ్డింగ్‌‌‌‌‌‌‌‌లు ప్రధానంగా 900,  1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌‌‌‌‌‌‌‌లలో జరిగాయి.  

వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, వొడాఫోన్ ఐడియా పాల్గొంటున్నాయి.  స్పెక్ట్రమ్ వేలం కోసం రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్లను డిపాజిట్ చేసింది.   భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ రూ.1,050 కోట్ల ఈఎండీని, వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ.300 కోట్ల ఈఎండీని సమర్పించాయి.