
న్యూఢిల్లీ: టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) మనదేశంలో 5జీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు బుధవారం ముంబైలో అందుబాటులోకి వచ్చాయి. త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. రాబోయే మూడేళ్లలో 17 సర్కిళ్లలోని వంద ప్రాంతాల్లో ఈ సేవలను అందిస్తామని కంపెనీ తెలిపింది.
ఇందుకోసం రూ.55 కోట్ల వరకు ఖర్చు చేస్తామని ప్రకటించింది. 4జీ కంటే 5జీ ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. వొడాఫోన్ ఐడియా షేర్లు బుధవారం ఐదు శాతం పెరిగి రూ.7.46 వద్ద ముగిశాయి.