ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కొన్ని కొత్త ఫీచర్స్ ని రిలీజ్ చేసింది. యూజర్స్ మధ్య కమ్యూనికేషన్, గ్రూప్స్ ని మరింత ఎఫెక్టివ్ గా వాడుకునేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడేలా డిజైన్ చేసింది టెలిగ్రామ్. టెలిగ్రామ్ రిలీజ్ చేసిన కొత్త ఫీచర్లపై ఏంటో, వాటివల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం:
గ్రూప్ స్టోరీస్:
ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ అడ్మిన్లు సభ్యులతో మరింత ఎఫెక్టివ్ గా ఇంటరాక్ట్ అయ్యేలా స్టోరీస్ అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. మునుపటికంటే ఎఫెక్టివ్ గా గ్రూప్ ని హ్యాండిల్ చేయటం కోసం ఏ ఫీచర్ ఉపయోగాపడుతుంది.
గ్రూప్ ఎమోజి ప్యాక్స్:
గ్రూప్ ఎమోజిస్ ద్వారా గ్రూప్స్ లో ఇంట్రాక్షన్స్ మరింత ఎఫెక్టీవ్ గా ఉంటాయి. గ్రూప్ లో ఉండే అందరు మెంబర్స్ ఈ ఫీచర్ ని వాడుకోవచ్చు.
వాయిస్ టు టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్:
ఈ ఫీచర్ ద్వారా వాయిస్ మరియు వీడియోలను టెక్స్ట్ లోకి సులువుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా గ్రూప్ మెంబర్స్ అందరు వాడుకోవచ్చు.
బూస్టర్స్ కి స్పెషల్ పర్మిషన్స్:
ఈ ఫీచర్ ద్వారా అడ్మిన్లు బూస్టర్స్ కి కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా బూస్టర్స్ గ్రూప్ ని రిస్ట్రిక్ట్ చేయచ్చు. దీని వల్ల గ్రూప్ మేనేజ్మెంట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది.
టెలిగ్రామ్ ప్రీమియమ్:
టెలిగ్రామ్ కొత్తగా ప్రీమియమ్ వర్షన్ ని స్టార్ట్ చేసింది. ఈ వర్షన్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్ కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ పొందొచ్చు. ఈ ఫీచర్ ద్వారా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే యూజర్స్ కి కొన్ని రివార్డ్స్ కూడా లభిస్తాయని టెలిగ్రామ్ తెలిపింది.