- పారిస్ ఎయిర్ పోర్టులోఅదుపులోకి తీసుకున్న అధికారులు
పారిస్ : టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్ లో పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అజర్బైజాన్ నుంచి పారిస్‌లోని లే బొర్గోట్కు చేరుకున్న ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, మైనర్లపై లైంగి క దాడికి సంబంధించిన కంటెంట్ ను ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
దీంతో ఫ్రాన్స్ అధికారులు గతంలో అరెస్టు వారెంట్ జారీ చేశారు. తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దురోవ్ పై దర్యాప్తు కొనసాగుతుండటంతో ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు స్పందించలేదు. అతడి అరెస్టుపై రష్యా ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాశ్చాత్య దేశాలు వాక్ స్వాతంత్ర్యంపై ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని విమర్శించారు.