టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సీఈఓ, ఫౌండర్ పావెల్ దురోవ్(Pavel Durov)ను పారిస్ పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని బోర్గెట్ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దురోవ్ తన ప్రైవేట్ జెట్‌లో అజర్‌బైజాన్ నుంచి బోర్గట్ విమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
టెలిగ్రామ్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఒకటి. YouTube, Facebook, WhatsApp, TikTok, Instagram తరువాత టెలిగ్రామ్ పేరే ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. కాకపోతే అశ్లీల కంటెంట్‌కు, సైబర్ నేరగాళ్లకు టెలిగ్రామ్ యాప్‌కు అడ్డాగా చెప్తుంటారు. సినిమాలు, వెబ్ సిరీసులు కంటెంట్ కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉండటంతో యువత బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు.