
మెసేజింగ్ యాప్‌లలో ప్రస్తుతం వాట్సాప్ తర్వాత ట్రెండింగ్ ఉన్న యాప్ టెలిగ్రామ్ అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ని వాడే యూజర్లు చాలామందే ఉన్నారు. మెసేజింగ్ మాత్రమేకాకుండా అందులో కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే టెలిగ్రామ్ యూజర్లకు కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఈ యాప్ వాడేవాళ్లకు సేఫ్టీ, సెక్యూరిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా ‘కాంటాక్ట్ కన్ఫర్మేషన్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది. టెలిగ్రామ్ యూజర్లకు ఎవరైనా కొత్త నెంబర్ నుంచి మెసేజ్ పంపినప్పుడు ఆ అకౌంట్ గురించిన వివరాలు ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.
స్పామ్ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇకపోతే ప్రీమియం యూజర్లకు ఇంకొన్ని ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది టెలిగ్రామ్ యాప్. అందులో ముఖ్యంగా కొత్త నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఫిల్టర్ చేయడం. దీంతో స్పామ్ కాల్స్, మెసేజ్‌లు తగ్గే అవకాశం ఉంది. ప్రొఫైల్ కవర్‌ను గిఫ్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఎమోజీ రియాక్షన్స్, అడ్వాన్స్డ్ సెర్చ్ ఫిల్టర్, కస్టమ్ ఎమోజీ ఫోల్డర్లు, క్యూఆర్ కోడ్ స్కానర్, సర్వీస్ మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్లు వంటి ఫీచర్లన్నీ అందుబాటులో ఉన్నాయి.