టెలిగ్రామ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది యూజర్లు వాడే మెసేజింగ్ యాప్. ఈ యాప్ 2025లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్స్, మెసేజ్ కోసం అడ్వాన్స్డ్ సెర్చ్ ఫిల్టర్లు, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఐకాన్స్, యాప్‌లోనే క్యూఆర్ కోడ్ స్కానర్, ప్రీమియం యూజర్లకు కస్టమ్ ఎమోజీ ఫోల్డర్లు.. ఇలా ఎన్నో కొత్త ఫీచర్లను టెలిగ్రామ్ యూజర్లకు పరిచయం చేసింది. వివరంగా చెప్పాలంటే..
టెలిగ్రామ్లో ఇకపై మీకు వచ్చే గిఫ్ట్‌లను స్పెషల్‌గా, అరుదైన ఐటెమ్స్‌గా మార్చుకోవచ్చు. వీటినే కలెక్టిబుల్స్ అంటారు. ఈ కలెక్టిబుల్స్‌ను రంగు, ఐకాన్, నెంబర్ వంటివాటితో ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్‌కి లేదా ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్‌లలో వేలం వేయొచ్చు.
సర్వీస్ మెసేజ్‌లకు కూడా ఎమోజీలతో రియాక్ట్ అవ్వొచ్చు. అంటే, ఎవరైనా గ్రూప్‌లో జాయిన్ అయితే మీకు గిఫ్ట్ పంపినా, వచ్చే నోటిఫికేషన్స్‌కు మీ ఫీలింగ్స్‌ను ఎమోజీల రూపంలో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు.
కొత్త సెర్చ్ ఫిల్టర్లతో మీకు కావాలసిన మెసేజ్‌లను ఈజీగా వెతకొచ్చు. ఏ రోజు మెసేజ్, ఎవరు పంపారు? అనే విషయాలు తెలుసుకోవచ్చు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉంటే వాళ్ల పేరు పక్కన స్పెషల్ లోగో ఉంటుంది. అయితే టెలిగ్రామ్లో ఇచ్చే రెగ్యులర్ వెరిఫైడ్ చెక్ మార్క్‌లా ఉండదు.
క్యూఆర్ కోడ్ ఫీచర్ ద్వారా స్కానింగ్ చేయొచ్చు. తద్వారా యూజర్లు లింక్స్‌ను డైరెక్ట్‌గా తమకు ఇష్టమైన బ్రౌజర్లో ఓపెన్ చేయొచ్చు.
ప్రీమియం యూజర్లు తమ ఫోల్డర్లకు కస్టమ్ ఎమోజీలను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఫోల్డర్లను పర్సనలైజ్ చేసుకోవచ్చు.