ఈ మధ్య కాలంలో ప్రైవసీ ఇష్యూస్ వల్ల చాలామంది వాట్సాప్ నుంచి టెలిగ్రామ్‌కు మారుతున్నారు. వాట్సాప్ వదిలేసి, కొత్తగా టెలిగ్రామ్‌లో జాయిన్ అవుతున్న వాళ్లు వాట్సాప్ చాట్ సేవ్ చేసుకునే అవకాశం లేదా? అంటే… ఉంది. టెలిగ్రామ్ అకౌంట్‌లోకి వాట్సాప్ యూజర్స్ తమ చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎక్కువమంది యూజర్స్ ఇలా వాట్సాప్ నుంచి టెలిగ్రామ్‌కు వస్తుండటంతో, వాళ్ల కోసం లేటెస్ట్‌గా ఈ అప్‌డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ చాటింగ్ టెలిగ్రామ్‌లోకి వచ్చే చాన్స్ ఉండటంతో, మరింతమంది యూజర్స్ ఈ యాప్ సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లపై ఇలా చాటింగ్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
యాపిల్ ఫోన్స్
మీరు యాపిల్ ఫోన్లో వాట్సాప్ వాడుతూ, టెలిగ్రామ్‌కు మారాలనుకుంటే ఇలా చేయొచ్చు. వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి, అందులో కాంటాక్ట్ ఇన్ఫో లేదా గ్రూప్ ఇన్ఫో పై క్లిక్ చేయాలి. తర్వాత ‘ఎక్స్‌పోర్ట్ చాట్’పై క్లిక్ చేస్తే, ‘షేర్ మెనూ’ కనిపిస్తుంది. ఇప్పుడు టెలిగ్రామ్ సెలెక్ట్ చేసుకుని, చాట్ హిస్టరీ షేర్ చేసుకోవాలి. ఐఓఎస్ ఫోన్లపై వాట్సాప్ ద్వారా డైరెక్ట్‌గా చాట్‌లిస్ట్‌లోంచి చాట్స్‌ను డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. కావాల్సిన చాట్‌పై లెఫ్ట్ స్వైప్ చేసి, ‘ఎక్స్‌పోర్ట్ చాట్’ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత టెలిగ్రామ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్స్
ఫోన్‌లో వాట్సాప్ యాప్ చాట్ ఓపెన్ చేసి, ‘మోర్’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘ఎక్స్‌పోర్ట్ చాట్’పై ట్యాప్ చేసి, షేర్‌మెనూలో టెలిగ్రామ్ సెలక్ట్ చేసుకుని కావాల్సిన నెంబర్‌కు షేర్ చేసుకోవచ్చు. అయితే, ఇందులో ఆ రోజుకు సంబంధించిన చాట్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకునే వీలుంది.
సైలెంట్ మెసేజెస్
టెలిగ్రామ్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ‘సైలెంట్ మెసేజెస్’. అంటే ఎవరికైనా మెసేజ్ పంపితే, రిసీవర్స్‌కు దానికి సంబంధించిన నోటిఫికేషన్ సౌండ్ రాకుండా మెసేజ్ వెళ్తుంది. అలాగే, షెడ్యూల్ మెసేజ్ అనే మరో ఆప్షన్ కూడా ఉంది. మెసేజ్ ముందే టైప్ చేసి, టైమ్ సెట్ చేసి పెడితే, ఆ టైమ్‌కు మెసేజ్ వెళ్తుంది.
ఈ రెండు ఫీచర్స్ వాడుకోవాలంటే మెసేజ్ టైప్ చేసి, సెండ్ బటన్ ప్రెస్ చేసి, మూడు సెకండ్లు హోల్డ్ చేయాలి. అప్పుడు షెడ్యూల్ మెసేజ్ అండ్ సెండ్ వితవుట్ సౌండ్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలోంచి కావాల్సిన ఫీచర్ సెలక్ట్ చేసుకోవచ్చు.