హైదరాబాద్, వెలుగు: భారతీయ రోగులకు అమెరికన్ వైద్యులతో 'టెలిమెడిసిన్ సర్వీస్’ను అందుబాటులోకి తెచ్చినట్టు మై అమెరికన్ డాక్టర్ సంస్థ ప్రకటించింది. సంస్థ సీఈవో రాజ్ హైదరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘తమ ట్రీట్మెంట్ గురించి అమెరికన్ డాక్టర్ల అభిప్రాయాలను తీసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. మా'టెలిమెడిసిన్' విధానం ద్వారా రోగులతో అమెరికా వైద్యులను అనుసంధానం చేస్తాం”అని వివరించారు.
'మై అమెరికన్ డాక్టర్'లో యునైటెడ్ స్టేట్స్కు చెందిన 50 మంది స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు. టెలి కన్సల్టేషన్‌కు 149 డాలర్లు (సుమారు రూ.12,367), ఫాలో-అప్‌కు ఇందులో సగం కట్టాలని రాజ్ వివరించారు.