ఇది ఉంటే.. ఫోన్​ని మెడలో వేసుకుని వీడియోలు షూట్​ చేసుకోవచ్చు !

ఇది ఉంటే.. ఫోన్​ని మెడలో వేసుకుని వీడియోలు షూట్​ చేసుకోవచ్చు !

సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు కంటెంట్​ క్రియేట్​ చేయడానికి కెమెరాలకు బదులు ఎక్కువగా ఐఫోన్​లనే వాడుతున్నారు. అలాంటివాళ్లకు ఫోన్​ పట్టుకుని నడుస్తూ, రకరకాల పనులు చేస్తూ వీడియోలు తీయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. ఈ నెక్​ మౌంట్​ ఉంటే ఫోన్​ని మెడలో వేసుకుని వీడియోలు షూట్​ చేసుకోవచ్చు. దీన్ని టెలెసిన్​ అనే కంపెనీ తీసుకొచ్చింది. దీనికి ఫోన్​ని ఎటాచ్​ చేసి, మెడలో వేసుకుని ఈజీగా వీడియోలు తీసేయొచ్చు. ఇన్‌‌‌‌స్టాలేషన్, రిమూవల్ ప్రాసెస్‌‌‌‌ కూడా చాలా ఈజీ. ఒక్క క్లిక్​తో దీన్ని అన్‌‌‌‌లాక్ చేయొచ్చు.

ముఖ్యంగా వ్లాగ్స్​, కుకింగ్​ వీడియోలు చేసేటప్పుడు ఇది బాగా యూజ్​ అవుతుంది. దీన్ని పోట్రెయిట్, ల్యాండ్‌‌‌‌స్కేప్ షూటింగ్ మోడ్స్​ కోసం కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవర్ హెడ్, లో-యాంగిల్  వీడియోలు కూడా తీసుకోవచ్చు. మాగ్నెటిక్ నెక్ బ్రేస్​ని ట్రిపుల్-లేయర్ స్టక్చర్‌‌‌‌తో తయారు చేశారు. లోపల స్టెయిన్‌‌‌‌లెస్ స్టీల్ గూస్‌‌‌‌నెక్, సపోర్ట్ కోసం అల్యూమినియం ప్లేట్స్​​ ఉన్నాయి. బయటిభాగంలో సిలికాన్​ ఫినిషింగ్​ ఉంటుంది. ఇది దాదాపు అన్ని రకాల ఐఫోన్లకు సరిపోతుంది. కాకపోతే.. కేస్​ తీసేసి, మౌంట్‌‌‌‌కి ఎటాచ్​ చేయాలి. శామ్​సంగ్​,  గూగుల్​లోని కొన్ని మోడల్స్​ ఫోన్లను కూడా దీనికి కనెక్ట్‌‌‌‌ చేసి వాడుకోవచ్చు.  

ధర : రూ. 2,199